JNU Attack: బాధితురాలిని బాధ్యురాలి చేసే కుట్ర‌!

  0

  గుడ్డ కాల్చి మొఖాన వేయ‌డం అన్న‌ది పాత సామెత. త‌ల ప‌గుల‌గొట్టి కేసులు పెట్ట‌డం మోదీ స‌ర్కారు నైజం అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. తాజాగా ఢిల్లీ జేఎన్యూ ప‌రిణామాల‌ను లోకమంతా చూసింది. విద్యార్థి సంఘం ఎన్నిక‌ల్లో ప‌దే ప‌దే ఓట‌మి చ‌విచూడాల్సి వ‌స్తుంద‌న్న‌ ఏబీవీపీ శ్రేణులు భౌతిక దాడుల‌కు పూనుకున్నారు. దాడుల్లో బాగ‌స్వాముల‌యిన వారంతా మొఖానికి మాస్కులు ధ‌రించ‌గా, వారి చేతుల్లో లాఠీలు, హాకీ స్టిక్స్ , ఇత‌ర ఆధారాల స‌హాయంతో వారి బండారం బ‌య‌ట‌ప‌డింది. వాట్సాప్ గ్రూప్ వ్య‌వ‌హారాలు లీక్ కావ‌డంతో ఏబీవీపీ కి చెందిన 8 మంది పేర్లు, ఫోటోలు వెలుగులోకి వ‌చ్చాయి. అందులో ఇప్ప‌టికే ప‌లువురు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ని డిలీట్ చేసుకుని త‌ప్పించుకుని ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

  ఇదంతా నాణానికి ఒక‌వైపు . రెండో వైపు క‌సాయి మూక‌ల దాడుల్లో తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న జేఎన్యూ అధ్య‌క్షురాలిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తీవ్ర‌మ‌యిన గాయాల‌తో ఆస్ప‌త్రి పాల‌యిన విద్యార్థి నాయ‌కురాలిపై కేసు బ‌నాయించ‌డం ఢిల్లీ పోలీసుల తీరుని చాటుతోంది. దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు తీరా బాధితురాలిని బాద్యురాలిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

  ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఏబీవీపీ ఎదురుదాడికి ప్ర‌య‌త్నం చేసింది. కానీ గాయ‌ప‌డిన వారిని త‌ర‌లిస్తున్న అంబులెన్స్ ని జేఎన్యూ గేట్ వ‌ద్ద అడ్డుకోవ‌డం, భార‌త్ మాతాకి జై అంటూ నినాదాలివ్వ‌డం, యోగేంద్ర యాద‌వ్ వంటి వారిపై గేటు వ‌ద్ద దాడికి ప్ర‌య‌త్నించ‌డం వంటి వ్య‌వ‌హారాల‌తో వారి అసలు గుట్టుర‌ట్ట‌య్యింది. అయినా త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి జ‌రిగిందంటూ అబ‌ద్ధాలు య‌ధేశ్ఛ‌గా ప్ర‌చారం చేసేందుకు ప్ర‌య‌త్నించి అభాసుపాల‌య్యింది. ఇక ఇప్పుడు అధికారం అండ‌తో మ‌రింత‌గా చెల‌రేగిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

  కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఉండే ఢిల్లీ పోలీస్ సాయంతో వాస్త‌వాన్ని వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నానికి పూనుకుంటోంది. ఇప్ప‌టికే ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స్పందించాల్సిన వీసీ మౌనంగా ఉన్నారు. ఢిల్లీ పోలీసుల‌కు ఆధారాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నా బాధితురాలి పై కేసు న‌మోదు చేశారు. త‌ద్వారా వాస్త‌వాల‌కు మ‌సిపూసేందుకు కాసాయి మూక‌లు బ‌లంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తప్పుని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి, దేశ‌మంతా వ‌స్తున్న నిర‌స‌న జ్వాల‌లు చ‌ల్లార్చ‌డానికి శ్ర‌మిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఢిల్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎదుటివారి మీద నింద‌లు మోప‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారిప‌ట్టించే ప్ర‌య‌త్నం సాగుతోంది. కానీ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఆధారాల‌న్నీ ఏబీవీపీని దోషిగా చూపుతున్న త‌రుణంలో వారికి అండ‌గా ఉండే పాల‌క‌ప‌క్ష పెద్ద‌ల‌కు ఢిల్లీ వాసులు బుద్ధి చెప్ప‌క త‌ప్ప‌దు.

  దొంగే దొంగ దొంగ అన్న‌ట్టుగా నేరం చేసి ఆ నెపాన్ని ఎదుటి వారిపైకి నెట్టే సంస్కృతి ఆర్ఎస్ఎస్ అండ్ కో కి ఆది నుంచి ఉంది. ఇప్పుడు కూడా అదే బాటలో సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మవుతోంది. పైగా అత్యంత‌కిరాత‌కంగా వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు నంగ‌నాచిలా న‌టించే య‌త్నం న‌డుస్తోంది. నేరాన్ని క‌ప్పిపుచ్చుకునే య‌త్నంలో ఫేక్ ప్ర‌చారం కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. ప్ర‌భుత్వం అండ‌తో మ‌రింత పెట్రేగిపోతున్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని పీక‌నులిమే ప్ర‌య‌త్నంలో అబ‌ద్ధాన్ని అందంగా తీర్చిదిద్దేంకు బ‌లంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయినా గోబెల్స్ ప్ర‌చారం ఎల్ల‌కాలం చెల్ల‌ద‌ని చివ‌ర‌కు గెలిచేది వాస్త‌వ‌మేన‌ని స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ప‌లికే భార‌తీయ‌తే మ‌రోసారి రుజువు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here