ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు ఎంత‌య్యాడో..!

0

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణూ దేశాయ్ ల ముద్దుల కుమారుడు అకీరా అంటే ప‌వ‌ర్ స్టార్ కి ఎంత ఇష్ట‌మో అంద‌రికీ తెలిసిందే. రేణూ దేశాయ్ తో విడాకుల త‌ర్వాత కూడా అకీరా కోసం ప‌దే ప‌దే పూణే వెళ్లి వ‌స్తుంటాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముద్దుల త‌న‌యుడు ఇప్పుడు న‌వ‌యువ‌కుడి రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. అది కూడా ఆర‌డ‌గుల ఆజానుబాహుడిగా మారిన త‌ర్వాత అకీరా ని చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయేటంత స్థాయిలో ఉన్నాడు. కథానాయకుడు అడివి శేష్ తాజాగా రేణూ దేశాయ్ ఇంటికి వెళ్లాడు. ఆమె ఆహ్వానం మేర‌కు ఎవ‌రు సినిమా విజ‌యాన్ని పంచుకునేందుకు పూణే వెళ్లాడు.

ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్‌ కుటుంబ సభ్యుల్ని క‌లిసిన ట్టు అడివి శేషు సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు. పవన్‌ కల్యాణ్‌-రేణుల కుమారుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా సమయం గడిపినట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘హ్యాండ్సమ్‌ కుర్రాడు అకీరాతో ఈ రోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి. మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలినీ’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

దాంతో అకీరాని చూసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏకంగా ఆరున్న‌ర అడుగుల పొడ‌వు ఉండ‌డంతో కాబోయే హీరో అంటూ కొంద‌రు కితాబులిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here