నాటి హీరోయిన్ తో చిందేసిన చిరు

0

సైరా సినిమా హిట్‌తో సూపర్ జోష్ మీదున్నాడు చిరంజీవి. ఆ జోష్‌లో ఉన్న చిరంజీవి  తన పాత మిత్రులతో కలిసి అదిరిపోయే పార్టీ చేసుకున్నాడు. 1980ల్లో తనతో కలిసి నటించిన వాళ్లందర్నీ పిలిచి తన కొత్త ఇంటిలో అదరిపోయే పార్టీ ఇచ్చాడు మెగాస్టార్. అయితే ఈ పార్టీ మామూలుగా ప్రతీ ఏడాది జరుగుతూ ఉంటుంది. ఈ సారి ఈ రెట్రో మీట్ తొమ్మిదేళ్లుగా ఒక్కోచోట జరుగుతూ ఈ సారి చిరంజీవి ఇంటికి వచ్చింది.

చిరంజీవి ఎంతో మనసుపడి కట్టుకున్న ఇంట్లో అంగరంగవైభవంగా ఈ పార్టీ జరిగింది. పదవ రీ యూనియన్ కావడంతో ఈ పార్టీకి  ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, జయసుధ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్.. వెంకటేష్, భానుచందర్, నరేష్, సురేష్, వెంకటేష్, నాగార్జున లాంటి చాలా మంది స్టార్స్ ఈ పార్టీకి వచ్చారు. ఈ పార్టీకి సంబందించి ఇంతకు ముందే పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా చిరంజీవి ఉత్సాహంగా అందాల ముద్దుగుమ్మ ఖుష్భూతో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ డాన్స్ వీడియో చిరంజీవి బంగారు కోడిపెట్ట సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్‌తో అదరగొట్టాడు. చిరంజీవి ఎనర్జీకి తగ్గట్లుగానే ఖుష్భూ కూడా చిందులేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here