స‌రిలేరు.. సినిమాకి హైలెట్ సీన్ అదే..!

0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మువీ స‌రిలేరు నీకెవ్వ‌రూ రిలీజ్ కి అంతా సిద్ధ‌మ‌య్యింది. సంక్రాంతి సంబరాలు అంబ‌రాన్నంటేలా చేసేందుకు భారీ సినిమాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న మ‌హేష్ బాబు ముందుకొస్తున్నారు. అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమా ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సమపాళ్లలో హైలెట్ అవుతుంది అనేది ట్రైలర్ లో చూస్తే అర్ధమవుతుంది. ఇక తాజాగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి ఓ మెయిన్ హైలెట్ ఉందని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కర్నూలు నేపథ్యంలో సాగుతూ క్రేజీ మాస్ ఫైట్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్‌లతో ఉండబోతుందట.

సినిమాలో కామెడీ, యాక్షన్ సన్నివేశాలన్నిటిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని సమాచారం. అలాగే ట్రైన్ ఎపిసోడ్ తో పాటుగా ప్రకాష్ రాజ్ – విజయశాంతి – మహేష్ కాంబో సీన్స్ కూడా ఓ రేంజ్ లో వుంటాయని అంటున్నారు. ఇప్ప‌టికే సినిమా ఫీవ‌ర్ స‌ర్వ‌త్రా వ్యాపించిన వేళ అంద‌రి దృష్టి మువీపైనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here