సూపర్ స్టార్ తో మళ్ళీ మిల్కీ బ్యూటీ

0

మిల్కీ బ్యూటీ కి మళ్లీ పెద్ద ఆఫర్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈసారి ఐటెమ్ సాంగ్ లో ఆమె మహేష్ బాబుతో కలిసి ఆడబోతోంది. గతంలో ఆగడు సినిమాలో మహేష్ సరసన నటించిన తమన్నా సక్సెస్ కాలేకపోయింది. ఈసారి ఐటెమ్ సాంగ్ తో ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. వీరిద్దరి కంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేయడంలో భాగంగా తమన్నా తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాలో కీలక సందర్భంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఆడిపాడనున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా మహేష్‌ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఆగడు సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి సూపర్‌ స్టార్‌తో ఆడిపాడనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here