సీఎంగారూ చూడండి! ఏమిటీ నేరాలు?

0

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్య‌క‌ర్త హ‌త్య‌, బ‌ళ్లంతో పొడిచి చంపిన టీడీపీ శ్రేణులు
తునిలో విలేక‌రి హ‌త్య‌, క‌త్తుల‌తో పొడిచిన దుండ‌గులు
పాల‌కొల్లులో విద్యార్థినిని ప్రేమించ‌డం లేద‌ని క‌త్తితో పొడిచిన యువ‌కుడు

ఒక్క రోజు వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలు వాస్త‌వ ప‌రిస్థితిని చాటుతున్నాయి. దిగ‌జారిపోతున్న శాంతిభ‌ద్ర‌త‌ల‌కు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఏపీని మ‌రో బీహార్ చేసేశార‌ని విప‌క్ష నేత చంద్ర‌బాబు విమ‌ర్శిస్తుండ‌గా, పాల‌క వైసీపీ నేత‌లు మాత్రం గ‌ట్టిగా కౌంట‌ర్ ఇస్తున్నారు.

క్షేత్ర‌స్థాయిలో వ‌రుస‌గా ఈ ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. క్రైమ్ రేట్ మ‌ళ్లీ పెరుగుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ ఘ‌ట‌న‌ల‌కు ఒక‌దానికి ఒక‌టి సంబంధం లేక‌పోయిన‌ప్ప‌టికీ స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీసింగ్ లేద‌ని చాటుతున్నాయి. విలేక‌రి హ‌త్య‌కు కార‌ణాలు ఏమ‌యిన‌ప్ప‌టికీ, త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని నెల క్రితం పోలీసుల‌ను క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత ప్రాణాలు కోల్పోవ‌డం మాత్రం నిర్ల‌క్ష్యంగా చెప్ప‌వ‌చ్చు. యంత్రాంగం వైఫ‌ల్యంగా భావించాల్సి ఉంటుంది.

ప్ర‌భుత్వం ఈ ప‌రిణామాల ప‌ట్ల స‌మ‌ర్థ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు త‌గ్గ‌ట్టుగా హోం శాఖ స్పందించాలి. అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here