సగం మంది జ‌ర్న‌లిస్టుల‌కు ద‌క్కే అవ‌కాశం లేదు..!

0

ఏపీ ప్ర‌భుత్వం అక్రిడిటేష‌న్స్ విష‌యంలో నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేసింది. ముఖ్యంగా చిన్న‌ప‌త్రిక‌లు, కేబుల్ చానెళ్ల‌ను క‌ట్ట‌డి చేసే ల‌క్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ప్ర‌స్తుతం అక్రిడిటేష‌న్లు ఉన్న వారిలో స‌గం మందికి అర్హ‌త ద‌క్కే అవ‌కాశం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ ఏడాది డిసెంబ‌ర్ తో ముగుస్తున్న అక్రిడిటేష‌న్ల గ‌డువుతో కొత్త‌వి జారీ చేసేందుకు స‌న్నాహాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా అర్హ‌త‌ల విష‌యంలో మార్పులు తీసుకొస్తూ కొత్త జీవో విడుద‌ల చేశారు. అందులో స‌బ్ క‌మిటీ సిఫార్సులు, జ‌ర్న‌లిస్ట్ సంఘాల నేత‌ల అబిప్రాయాల‌కు అనుగుణంగా మార్పులు చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ మార్పులు దానికి భిన్నంగా ఉన్నాయ‌ని కొంద‌రు జ‌ర్న‌లిస్టులు చెబుతున్నారు.

ముఖ్యంగా చిన్న‌ప‌త్రిక‌ల‌కు సైజులు, పేజీలు, స‌ర్క్యూలేష‌న్ తో పాటుగా జీఎస్టీ వివ‌రాలు కూడా స‌మ‌ర్పించాల‌నే నిబంధ‌న మూలంగా చిన్న‌ప‌త్రిక‌ల‌కు దాదాపుగా అక్రిడిటేష‌న్ అవ‌కాశం పోతుంది. ముఖ్యంగా అన్నీ ఉన్నా జీఎస్టీ వ్య‌వ‌హారంలో చాలామంది ఛాన్స్ మిస్స‌వుతార‌నే చెబుతున్నారు. ఇక విలేక‌రుల విద్యాభ్యాసం అర్హ‌త‌లు కూడా నిర్ణ‌యించ‌డంతో చాలామంది అన‌ర్హుల లిస్టులోకి పోతారు.

ఇక కేబుల్ చానెళ్ల‌కు క‌నీసంగా 3 బులిటెన్లు న‌డ‌వాల‌నే కండీష‌న్ తో చాలామందికి కొర్రీలు ప‌డ‌డం ఖాయంగా ఉంది. దాంతో ప్ర‌స్తుతం ఉన్న వారిలో అత్య‌ధికులు అవ‌కాశం కోల్పోతార‌నే చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ నిబంధ‌న‌ల ప‌ట్ల వ్య‌తిరేక‌త మొద‌ల‌య్యింది. అయిన‌ప్ప‌టికీ అమ‌లులోకి తీసుకొస్తున్న నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఝ‌ల‌క్ ఖాయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

చంద్ర‌బాబు హ‌యంలో ఇష్టారాజ్యంగా పెంచిన అక్రిడిటేష‌న్ల విష‌యంలో నిబంద‌న‌లు క‌ఠిన‌త‌రం చేయ‌డం ద్వారా అదుపుచేయాలనే ల‌క్ష్యంతో జ‌గ‌న్ స‌ర్కారు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు పంపిణీ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న త‌రుణంలో అర్హుల‌కు మాత్ర‌మే అందించ‌డానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here