వైసీపీ పై నారా లోకేశ్ సెటైర్లు..!

0

టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ గా ఉన్న ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ దూకుడు పెంచారు. వైసీపీ నేత‌ల‌పై సెటైర్లు విసిరారు. ఏకంగా పేటీఎం బ్యాచ్ అంటూ వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను సంబోధించారు. వారిని చూస్తే న‌వ్వొస్తుందంంటూ ట్వీట్ చేశారు.

వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆవేశం చూస్తుంటే నవ్వొస్తోందని లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అకౌంట్లో జగన్ గారి చిల్లర పడితే చాలు ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారని లోకేశ్ విమర్శించారు. సీఎం రమేశ్ గారి కొడుకు పెళ్లికి లోకేశ్ దుబాయ్ వెళ్లాడంటూ ఎప్పుడో 2015లో అమెరికా వెళ్లినప్పటి ఫొటోలు పోస్టు చేసి కొత్త కథ అల్లారని మండిపడ్డారు. అంతేకాకుండా, ఈ విధమైన పోస్టులు చేసేవారిపై లోకేశ్ జాలి ప్రదర్శించారు. “సోషల్ మీడియాలో మీరు ఒక పోస్టు చేస్తే ఇంకా ఐదు రూపాయలే ఇస్తున్నారట కదా! కాస్త ఎక్కువ అడగండి స్వామీ… జే ట్యాక్స్ తో కోట్లు వసూలు చేసుకుంటున్నారు… మీకు ఇంకా ఐదు రూపాయలే అకౌంట్లో వేస్తే ఎలా!” అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

దీంతో ఇప్పుడు నారా లోకేశ్ దూకుడు పై వైసీపీ సోష‌ల్ మీడియా కూడా అదే రీతిలో కౌంట‌ర్ ఇస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here