రెండో స్థానంలో సాక్షి టీవీ

0

తెలుగు నెటిజ‌న్ల‌కు ఫేస్ బుక్, వాట్సాప్ తో పోలిస్తే ట్విట్ట‌ర్ వాడ‌కం మీద పెద్ద ఆస‌క్తి ఉండ‌దు. అయితే ఇటీవ‌ల కాలంలో తెలుగు నేత‌లు, సెల‌బ్రిటీలు త‌మ అభిప్రాయాల‌ను ట్వీట్ల రూపంలో తెలియ‌జేస్తుండ‌డంతో అంద‌రి దృష్టి మ‌ళ్లుతోంది. ట్విట్ట‌ర్ వాడ‌కం దార్ల సంఖ్య తెలుగు జ‌నాల్లో కూడా పెరుగుతోంది.

అయితే తెలుగు న్యూస్ చానెళ్ళ‌కు ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ లో ప్ర‌స్తుతం టీవీ9 ఎవ‌రికీ అంద‌నంత దూరంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. మొద‌టి నుంచి బార్క్ రేటింగ్స్ లో కూడా ముందున్న ఈ చానెల్ కి ట్విట్ట‌ర్ లో ఏకంగా 2.58ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లున్నారు. ఇప్పుడు రెండో స్థానంలో ల‌క్ష మంది ఫాలోవ‌ర్లను సాధించిన సాక్షి నిలిచింది. ఇటీవ‌ల కాలంలో అనూహ్యంగా సాక్షిటీవీకి ఫాలోవ‌ర్స్ పెర‌గ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఏపీలో అధికార పార్టీ స్వ‌రం వినిపించే ఈ చానెల్ కి ట్విట్ట‌ర్ లో ఆద‌ర‌ణ పెర‌గ‌డం వైసీపీ శ్రేణుల‌కు కూడా సంతృప్తినిస్తోంది.

ఇక ఆ త‌ర్వాత వీ6 చానెల్ ఉంది. ఆ చానెల్ కి 90వేల మంది ఫాలోవ‌ర్లున్నారు. ఏబీఎన్ కి 78 వేల మంది, ఎన్టీవీ కి 56 వేల మంది ఫాలోవ‌ర్లున్నారు. రేటింగ్స్ లో కూడా ఇటీవ‌ల ముందంజ‌లోకి వ‌స్తున్న సాక్షికి ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ పెరుగుతున్న తీరు ఆస‌క్తిదాయ‌క‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here