రీ ఎంట్రీ ఇస్తున్న తెలుగోడు..!

0

టీమిండియాలో తెలుగు క్రికెట‌ర్ల సంఖ్య స్వ‌ల్పంగానే ఉంటుంది. అందులోనూ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్న వాళ్లు ఇంకా అరుదుగా ఉంటారు. కొంద‌రికి అవ‌కాశాలు వ‌చ్చి, స‌ద్వినియోగం చేసుకున్నా, వివిధ కార‌ణాల‌తో దూర‌మ‌యిన వారు కూడా ఉన్నారు. ఆ జాబితాలో కీల‌కంగా క‌నిపించే మిడిలార్డ‌ర్ బ్యాట్స్ మేన్ అంబ‌టి రాయుడు ఓ సంచ‌ల‌నంగానే చెప్పాలి.

క్రికెట్ లో అనేక ఉద్ధాన ప‌త‌నాలు చూసిన రాయుడు ఇటీవ‌ల హ‌ఠాత్తుగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపాడు. పెద్ద చ‌ర్చ‌కు ఛాన్సిచ్చాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఆలోచ‌న‌కు రావ‌డం విశేషంగా మారింది. వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్ లో త‌న‌కు చోటు క‌ల్పించ‌కుండా అన్యాయం జ‌రిగింద‌నే ఆవేద‌న‌తో క్రికెట్ కి దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన రాయుడు, ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ కి
ఆస‌క్తి చూప‌డం మ‌రో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు దేశ‌వాళీ క్రికెట్ తో పాటు అంత‌ర్జాతీయంగానూ మంచి ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. అయితే టెంప‌ర్మెంట్ కారణంగా ప‌లుమార్లు స‌మ‌స్య‌లు కొనితెచ్చుకున్న‌ట్టు కనిపించింది. ఇక ఈసారి త‌న నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకుని మ‌ళ్లీ బ్యాట్ ప‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ ఎలాంటి ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here