రాధాకృష్ణ‌ని జ‌గ‌న్ ఏమీ చేయ‌లేరు..!

0

వేమూరి రాధాకృష్ణ‌కు న్యాయ‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ప్రైవేటు వ్య‌క్తులు వివిధ పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తోంది. దాంతో కొత్త ప‌లుకుల‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

ఇంగ్లీష్ మాధ్య‌మం ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఏపీలో క్రైస్త‌వ మ‌త వ్యాప్తికి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అపోహ‌లు పెంచేందుకు ప్ర‌య‌త్నించారంటూ రాధాకృష్ణ మీద ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల త‌న ప‌త్రిక‌, చానెల్ లో రాసిన‌, కూసిన రాత‌ల‌పై జ‌నంలో ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. దానికి ప్ర‌తిస్పంద‌న‌గానే ఫిర్యాదుల వెల్లువ క‌నిపిస్తోంది.

ఏలూరు, నూజివీడు, జ‌గ్గ‌య్య‌పేట వంటి చోట్ల ఇప్ప‌టికే ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. కేసులు పెట్టాల‌నే ఒత్తిడి కూడాపెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌తాల ఆధారంగా స‌మాజంలో ఉద్రిక‌త్త‌లు రాజేసే రీతిలో క‌థ‌నాలు ప్ర‌సారం చేసినందుకు కేసు న‌మోద‌యితే న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో రాధాకృష్ణ ఇరుక్కుంటారు. అదే స‌మయంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్ కూడా ఏబీఎన్ రాధాకృష్ణ‌ను సూటిగా హెచ్చ‌రించారు.

అయినా రాధాకృష్ణ వెన‌క్కి త‌గ్గే అవ‌కాశాలు లేవ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అమిత్ షా అండ‌దండ‌లు ఆయ‌న‌కున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. బీజేపీ ఆలోచ‌న‌లో భాగంగానే ఆయ‌న జ‌గ‌న్ మీద దుమ్మెత్తిపోయ‌డానికి వెన‌కాడ‌డం లేదంటున్నారు. గ‌తంలో త‌న చానెల్ ని ఏపీలో నియంత్రించిన స‌మ‌యంలో అమిత్ షా భేటీ కావ‌డం ద్వారా మ‌ళ్లీ ఏబీఎన్ ప్ర‌సారాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకున్న రాధాకృష్ణ‌కు వైసీపీ నేత‌లు, మంత్రుల హెచ్చ‌రిక‌లు ఖాత‌రు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. బీజేపీ అధిష్టానం అండ‌దండ‌ల‌తో కొత్త ప‌లుకులు ప‌లుకుతున్న రాధాకృష్ణ విష‌యంలో ఏం చేయాల‌న్న‌ది జ‌గ‌న్ అండ్ కో కి కూడా ఎటూ పాలుపోవ‌డం లేద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. దాంతో చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here