యాంక‌ర్ చిలిపి చేష్ట‌లు, అవాక్క‌వుతున్న ఆడియెన్స్!

0

యాంకర్ వర్షిణి చేసిన చిలిపి పని ఆమెకు ఇప్పుడు విమర్శలు తీసుకొస్తుంది. తెలుగులో శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి హేమాహేమీ యాంకర్స్ మధ్య పేరు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు. అందుకే వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో ఇప్పుడు ఏకంగా అరాచకం చేసింది. తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్న ఈ యాంకర్ చేష్టలు రోజురోజుకీ మరీ మితిమీరిపోతున్నాయి.

మొన్నటికి మొన్న షో జరుగుతున్న సమయంలోనే అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది. ఈ వీడియో వైరల్ అయింది. సాధారణంగా ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ స్టేజ్‌పైకి పిలిచింది వర్షిణి. పిలిచిన తర్వాత ఊరికే ఉండకుండా ఏకంగా అంతా చూస్తుండగానే ఆ అబ్బాయి బుగ్గను గట్టిగా కొరికేసింది.

ఆ తర్వాత హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గిరాగిరా తిప్పేసింది. ఆదితో కూడా హద్దులు మీరి మరీ ఇష్టమొచ్చినట్లు చేస్తుందంటూ వర్షిణిపై సెటైర్లు పేలుతున్నాయి. ఎంత కో యాంకర్ అయితే మాత్రం కనీసం కెమెరా ఉందని కూడా చూసుకోలేవా అంటూ వర్షిణిని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు మరోసారి పటాస్ షోలో అమ్మాయిల బుగ్గలు కొరుకుతూ పిచ్చి పని చేసింది. చేతిలో పూలు అమ్ముకుంటూ బుగ్గలు కొరుకుతూ ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది వర్షిణి . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here