మ‌హేష్ మువీ మెహ‌ర్ ర‌మేష్ చేతుల్లో..!

0

మెహ‌ర్ ర‌మేష్. ఒక‌టి రెండు స‌క్సెస్ లు సాధించిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాఫుల‌తో స్టార్ హీరోల‌ను సైతం టెన్ష‌న్ పెట్టిన ద‌ర్శ‌కుడు. అందుకే ఇప్పుడు మ‌హేష్ బాబు మువీ అన‌గానే ఫ్యాన్స్ క‌ల‌వ‌ర‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

పూరి జగన్నాథ్ స్కూల్ నుండి వ‌చ్చి భారీ చిత్రాల‌నే తీసినా నిర్మాతల జేబులు గుల్ల కావ‌టంతో అస‌లు మొహ‌ర్ పేరు చెపితేనే జ‌నం భ‌య‌ప‌డి పారిపోయే ప‌రిస్థితిని కొని తెచ్చుకున్నాడు. అందుకు ఆయ‌న‌గారు తీస‌ని సినిమాలే నిద‌ర్శ‌నం. ఇప్ప‌టికి ఆరేళ్ళు అయినా మెహర్ కు మరో సినిమా చేసే అవకాశం ద‌క్క‌లేదంటే నిర్మాత‌లెంత ఆందోళన చెంది ఉంటారో అర్ధం చేసుకోవ‌చ్చు. దీంతో అవ‌కాశాలు వ‌చ్చేలా క‌నిపించ‌క‌పోవ‌టంతో మహేష్ కు క్లోజ్ అయిన మెహర్ ర‌మేష్ నెమ్మదిగా మహేష్ దగ్గరే అక్క‌డ పిఆర్ పనులు చూసుకుంటూ సెటిలైపోయాడు.

అయితే తాజాగా మెహ‌ర్ డిస్ట్రిబ్యూటర్ గా అవ‌తారం ఎత్తుతున్న‌ట్టు వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర గుంటూరు హక్కులను మహేష్ చెప్పాడు కాబట్టి రేటు విషయంలో పట్టుబట్టకుండా హక్కులను నిర్మాత‌లు. మరి ఈ విధంగానైనా మెహర్ డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో సెటిలైపోతాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here