మ‌ళ్లీ సెట్స్ పైకి చిరు

0

సైరా సినిమా మంచి ఇమేజ్ మిగిల్చినా, క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ కావ‌డంతో మెగాస్టార్ కొంత నిరాశ చెందారు. దాంతో రాబోయే సినిమాతో ఆ న‌ష్టాన్ని పూడ్చుకోవాల‌ని చూస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే క‌మ‌ర్షియ‌ల్ హిట్ డైరెక్ట‌ర్ తో జ‌త‌గ‌డుతున్న త‌రుణంలో భారీ ఆశ‌ల‌తో మ‌ళ్లీ సెట్స్ పైకి వ‌చ్చారు. చిన్న పాటి గ్యాప్ తో మొద‌ల‌వుతున్న ఈ సినిమా మీద చిరు అభిమానుల‌కు గంపెడాశ‌లు క‌నిపిస్తున్నాయి.

డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరుతో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ నేటి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. హైదరాబాద్ వేదికగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నేటి నుండి నిరవధికంగా షూటింగ్ జరపనున్నారు. 2020 ఆగస్టు 14న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం సీనియర్ దర్శకుడు మణిశర్మ అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మణిశర్మ, కొరటాల శివ థాయిలాండ్ వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ఈ చిత్రం కొరకు ఒక ఏడాదికి పైగా కొరటాల ఎదురుచూశారు.  ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.

కమర్షియల్ అంశాలు కలిగిన సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్ర బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here