మ‌ళ్లీ చీక‌టి రోజులు త‌ప్ప‌వా?

  0

  భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే కాదు ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే నియంత‌ల పాల‌న ఎప్పుడ‌యినా ప్ర‌మాద‌క‌ర‌మే. ప్ర‌జాస్వామ్య‌మే ప్రపంచంలో అంద‌రికీ శ్రేయ‌స్క‌రం అని అనేక ఘ‌ట‌న‌లు తేట‌తెల్లం చేశాయి. దేశంలో ఇందిరాగాంధీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యం కొన‌సాగిన కాలంలో ఎమ‌ర్జ‌న్నీ చీక‌టి పాల‌న‌ను దేశం చవిచూసింది. చివ‌ర‌క ప‌త్రిక‌ల్లో కూడా ఎడిటింగ్ చేస్తుండ‌డంతో న‌ల్ల ప‌త్రిక‌ల‌ను పంచిపెట్టి నిర‌స‌న తెలిపాల్సిన అనుభ‌వం మ‌న దేశంలో ఉంది.

  ఇక తాజాగా న‌రేంద్ర మోడీ పాల‌న‌లో ప్ర‌జాస్వామ్యం వేగంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. నెంబ‌ర్ గేమ్ లో అనూహ్య‌బ‌లం ద‌క్క‌డంతో ఎక్క‌డాలేనంత వేగంగా అడుగులు వేస్తున్నారు. త‌మ సైద్ధాంతిక విధానాల‌కు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. చివ‌ర‌కు క‌శ్మీర్ లో చేసిన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ద్వారా దేశానికి ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటూ చెప్పిన మాట‌లు ఆరు నెల‌లు దాటినా ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. క‌శ్మీర్ మంట చ‌ల్లార‌లేదు. చివ‌ర‌కు ఇంట‌ర్ నెట్ కూడా నేటికీ పున‌రుద్ద‌రించ‌లేదంటే అక్క‌డి ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

  అందుకు తోడుగా ఎన్నార్సీ మంట రాజేశారు. పౌర‌స‌త్వ స‌వ‌రణ చ‌ట్టం ద్వారా దేశ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారుతోంది. ఇప్పుటికే నిర‌స‌న‌ల సంద‌ర్భంగా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. మిలియ‌న్ మార్చ్ ల‌తో ల‌క్ష‌ల మంది రోడ్డెక్కి నిత్యం ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో స‌మ‌స్య ప‌రిష్క‌రించి, సామ‌రస్యంగా వ్య‌వ‌హ‌రించే ధోర‌ణికి మోడీ-షాలు స‌సేమీరా అంటున్నారు. దాంతో దేశంలో ఏర్ప‌డ్డ అనిశ్ఛితి ఎక్క‌డికి దారితీస్తుంద‌న్న‌ది అంతుబ‌ట్ట‌కుండా ఉంది. అసోంలో అమ‌లు చేసిన ఎన్నార్సీ 19ల‌క్ష‌ల మందిని డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించడానికి కార‌ణం అయ్యింది. అందులో 15ల‌క్ష‌ల మంది హిందువులే ఉన్నారు. వారిలో బీజేపీ మ‌ద్ధ‌తుదారులు కూడా ఉన్న‌ప్ప‌టికీ ఆధారాలు లేక డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌కు త‌ర‌లిపోవాల్సి వ‌చ్చింది.

  జేఎన్యూ విద్యార్థుల‌పై దాడిని నిర‌సిస్తూ 16గం.లుగా ముంబై లో ఆక్యుపై గేట్ వే ఆఫ్ ఇండియా పేరుతో కొన‌సాగుతున్న నిర‌స‌న‌లు.

  నేరుగా ప్ర‌ధాన‌మంత్రి తాము ఎన్నార్సీ గురించి చ‌ర్చించ‌లేద‌ని ఒక‌సారి, అస‌లు డిటెన్ష‌న్ సెంట‌ర్లు దేశంలో లేవ‌ని మ‌రోసారి అబ‌ద్ధాలు వ‌ల్లిస్తుంటే ఎవ‌రిని న‌మ్మాల‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు అంతుబ‌ట్ట‌ని అంశంగా మారింది. ప్ర‌జ‌ల ముందు అర్థ‌స‌త్యాలు వ‌ల్లించే నాయ‌కుడి పాల‌న ఇంకెంత దుర్మార్గంగా ఉంటుంద‌న్న‌ది ఊహించాల్స‌ని అవ‌స‌రం లేద‌ని చ‌రిత్ర‌లో అనేక మంది అనుభ‌వాలు చాటుతున్నాయి. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే ప్ర‌స్తుతం ఉద్య‌మ కెరటాల్లా విరుచుకుప‌డుతున్న విద్యార్థుల‌పై బాహాటంగా దాడుల‌కు పూనుకోవ‌డం మ‌రో ప్ర‌మాద‌క‌రం సంకేతం. అత్యున్న‌త విశ్వ‌విద్యాల‌యంలో చొర‌బ‌డి అమ్మాయిల‌ను సైతం గాయ‌ప‌ర‌చ‌డం అత్యంత హేయ‌మైన ఘ‌ట‌న‌గా మిగిలిపోతుంది. చ‌రిత్ర‌లో మ‌రోసారి చీక‌టి రోజులు వ‌స్తున్నాయ‌నే సంకేతాల‌ను ఈ ప‌రిణామాలు ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు ప్ర‌తిఘ‌టించి వాటిని వెన‌క్కి తిప్పికొట్ట‌డ‌మే ఇప్పుడున్న ఏకైక మార్గం. పార్ల‌మెంట్ లో మెజారిటీ పేరుతో ప్ర‌జాస్వామ్య‌పునాదులు కూల‌దోస్తుంటే అడ్డుకోవ‌డం ఇప్పుడు అంద‌రి క‌ర్త‌వ్యం.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here