మోడీకి షాక్: గో బ్యాక్ అంటూ ట్రెండింగ్

0

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మ‌రోసారి త‌మిళ‌నాడులో అడుగుపెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. చైనా అధ్య‌క్షుడితో మూడు రోజుల ద్వైపాక్షిక చ‌ర్చ‌ల కోసం ఆయ‌న త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురం ఎంచుకున్నారు. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకున్న ఈ ప‌ట్ట‌ణంలో జ‌రిగే ఇరు దేశాల చ‌ర్చ‌ల్లో దేశ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఇప్ప‌టికే ప‌లుమార్లు మోడీ రాక‌ను వ్య‌తిరేకించిన త‌మిళ‌నాడు ఈసారి అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారంలో కూడా మోడీ ప‌ర్య‌ట‌ను తిర‌స్క‌రిస్తోంది. త‌న వ్య‌తిరేక‌త‌ను సోష‌ల్ మీడియాలో చాటుతోంది. #GoBackModi అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. అంత‌ర్జాతీయంగా కూడా ఈ హ్యాష్ ట్యాగ్ బాగా పాపుల‌ర్ కావ‌డం విశేషంగా మారింది.

గ‌తంలో కూడా ప‌లుమార్లు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధానికి ఇదే రీతిలో ట్విట్ట‌ర్ నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో కూడా మోడీ పార్టీకి త‌మిళ‌నాడు ఘోర ప‌రాభ‌వం ఎదుర‌య్యింది. ఇక ఈసారి చైనా తో చ‌ర్చ‌ల కోసం వ‌స్తున్న ప్ర‌ధానిని వ్య‌తిరేకించ‌డం ప‌ట్ల ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ స్పందిస్తూ ఇది చాలా విచార‌క‌రం అన్నారు. ప్ర‌ధాని హోదాలో చైనాతో చ‌ర్చ‌లు అంత‌ర్జాతీయంగా ప్రాధాన్య‌త కూడుకున్న‌వ‌ని, అయిన‌ప్ప‌టికీ ట్రెండింగ్ లో మోడీ గో బ్యాక్ అనే నినాదం ముందుండ‌డం వెనుక రాజ‌కీయాలు సరికాద‌ని పేర్కొన్నారు.

అదే స‌మ‌యంలో #GoBackModi హ్యాష్ ట్యాగ్ చైనీస్ వంటి ప‌లు భాష‌ల్లో కూడా ట్రెండింగ్ లో ఉండ‌డం విస్మ‌య‌క‌రంగా మారింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేశ ప‌రువు తీస్తున్న వ్య‌వ‌హారంగా మారుతోంది. మోడీ గో బ్యాక్ అంటూనే జింపింగ్ కి స్వాగ‌తం చెబుతూ నెటిజ‌న్లు ట్వీట్లు చేయ‌డం ఆస‌క్తిక‌ర విష‌యంగా మారింది. దీని వెనుక చైనా కుట్ర ఉంద‌ని కొంద‌రు ఆరోపిస్తుండ‌గా త‌మిళ‌నాట మోడీకి ఇలాంటి అనుభ‌వం కొత్త‌కాద‌ని ప‌లువురు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here