మాఫియా మూలాల నుంచి బీజేపీకి నిధులు

0

కేంద్రంలో అధికారంలో బీజేపీకి నిధుల వెల్లువ బ‌హిరంగంగానే క‌నిపిస్తోంది. అయితే ఎల‌క్ట్రోల్ బాండ్స్ పేరుతో బ‌డా కంపెనీల నుంచి భారీగా నిధులు సంపాదిస్తున్న బీజేపీ ప‌నిలో ప‌నిగా అక్ర‌మార్కుల నుంచి కూడా వ‌సూళ్లు చేప‌డుతున్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ప‌లు ఆర్థిక నేరాల్లో ఇరుక్కుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ ఎదుర్కొంటున్న కంపెనీ నుంచి బీజేపీకి నిధులు రావ‌డం విశేషంగా మారింది. స్వ‌యంగా ఆపార్టీ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కార‌మే ఈ విష‌యం బ‌య‌కు వ‌చ్చింది.

ఆర్కే డ‌బ్ల్యూ డెవ‌ల‌ప‌ర్స్ లిమిటెడ్ కంపెనీ అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో ఆదాయాలు సంపాదించిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఈడీ విచార‌ణ కూడా సాగుతోంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుల ద‌గ్గ‌ర నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన విష‌యంలో తీవ్ర‌వాద కోణంలో కూడా ప‌లు అనుమానాలున్నాయి. దావూద్ ఇబ్ర‌హీం కి స‌న్నిహితులైన ఇక్బాల్ మెమెన్, ఇక్బాల్ మిర్చి నుంచి ఆర్కే డ‌బ్ల్యూ కొనుగోలు చేసిన ఆస్తులు వివాద‌స్ప‌దంగా మారాయి.

అలాంటి కంపెనీ నుంచి బీజేపీకి ఏకంగా 10కోట్ల రూపాయ‌ల నిధులు అధికార‌యుతంగా చేరాయి. ఇప్ప‌టికే ఆ కంపెనీ మాజీ డైరెక్ట‌ర్ రంజీత్ బింద్రాని ఈడీ అరెస్ట్ కూడా చేసింది. మాఫియా లింకుల‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఇలాంటి మాఫియా, ఆర్థిక నేరాల ఆరోప‌ణ‌ల‌తో ఉన్న వారి నుంచి అధికార పార్టీకి నిధులు స‌మ‌కూర‌డం వెనుక పెద్ద కార‌ణాలే ఉంటాయ‌నే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కార్పోరేట్ సంస్థ‌లు క‌మ‌ల‌ద‌ళానికి కోట్లు అందిస్తున్న‌ట్టు బీజేపీ వెల్ల‌డించిన లెక్క‌లే చాటుతున్నాయి. వాటికి తోడుగా నేర సామ్రాజ్యం నుంచి కూడా నిధులు వ‌స్తున్న‌ట్టు తేల‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. తీవ్ర‌వాదుల‌తో సంబంధాలున్న వారు అధికార పార్టీకి నిధులు అందించ‌డం వెనుక కార‌ణాల‌పై ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here