మంత్రి, ఎంపీ మధ్య వివాదం, వైసీపీలో చిచ్చు

0

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. పార్టీలో చిచ్చు రేపుతున్నాయి. కార్యకర్తల మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయి. ఆధిపత్యం కోసం సీనియర్లు, జూనియర్లు అంటూ సాగుతున్న వ్యవహారం చక్కదిద్దే నాథుడు లేకపోవడంతో చివరకు ఎక్కడికి దారితీస్తుందోననే ప్రశ్న ఉదయిస్తోంది.

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బరిలో దిగిన ప్రస్తుత మంత్రి విశ్వరూప్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన గడిచిన ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా బరిలో దిగి, విజయం సాధించడమే కాకుండా జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. సోషల్ వెల్ఫేర్ మంత్రిగా సాగుతున్నారు. అదే సమయంలో ఏడాది క్రితం పార్టీలో చేరిన చింతా అనురాధ ప్రస్తుతం అమలాపురం ఎంపీగా విజయం సాధించారు.

ఎన్నికలకు ముందు నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేదనే ప్రచారం సాగింది. చివరికిప్పుడు అధికారం చేపట్టిన తర్వాత కూడా సఖ్యత కనిపించడం లేదు. పైగా ఆధిపత్యం కోసం ఇద్దరూ ప ట్టుదలగా సాగుతుండడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. అనురాధ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆమెకు అండగా ఉండడంతో అమలాపురంలో కూడా తన పెత్తనం కోసం అనురాధ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం మొదలయ్యింది.

అదే సమయంలో విశ్వరూప్ తన సీనియారిటీకి తగ్గట్టుగా సమన్వయం చేసుకోవాల్సింది పోయి మరింత దూరం చేసుకునే రీతిలో వ్యవహరిస్తుండడంతో వ్యవహారం ముదురుతుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. ఇరువైపులా పట్టుదలకు పోతుండడంతో పార్టీ పరువు పోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఇద్దరు నేతల మధ్య తీవ్రంగా సతమతమవుతున్నట్టు చెబుుతన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here