బ‌న్నీ వార‌సులు వ‌చ్చేశారు..!

0

టాలీవుడ్ లోకి మ‌రో త‌రం ప్ర‌వేశిస్తోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు కుమార్తె తో పాటుగా వార‌సుడుగా తెర‌మీద హ‌ల్ చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం బ‌న్నీ వార‌సులు కూడా వ‌చ్చేశారు. అల‌వైకుంఠాపురంలో ఈ ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. వాటికి పోటీగా ఇప్పుడు మరో పాట ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన సాంగ్‌ టీజర్‌ను బాలల దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కనిపించిన ప్రత్యేక అతిథులను చూసి బన్నీ అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ పాటను బన్నీ కుమారుడు ఆర్యన్‌, కూతురు అర్హలతో మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘ఓ మై గాడ్‌ డాడీ..’ అంటూ సాగే పాటలో ఆర్యన్‌ అచ్చం తండ్రిలానే స్టెప్పులేయడానికి ప్రయత్నించడం అందరినీ ఆకర్షిస్తోంది.

తండ్రికి తగ్గ తనయుడు అంటూ ఆర్యన్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు బన్నీ ఫ్యాన్స్‌. మరోవైపు కూతురు అర్హ కూడా ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో పడేసింది. ఈ పాటలో అల్లు అర్జున్‌ పోస్టర్ ముందు ఇద్దరు చిన్నారులు నెత్తిన చేయి పెట్టుకుని పెర్ఫార్మ్‌ చేయడం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాటకు తమన్‌ సంగీతాన్ని చేకూర్చగా కృష్ణ చైతన్య లిరిక్స్‌ అందించాడు. రోల్‌ రీడా, రాహుల్‌ సిప్లిగంజ్‌, రాహుల్‌ నంబియార్‌, రాబిట్‌ మ్యాక్‌, బ్లెజీ పాడారు. పూర్తి పాటను నవంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాసేపటి క్రితమే విడుదలైన ‘ఓమైగాడ్‌’ సాంగ్‌ టీజర్‌ ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here