బాబుకి మింగుడుప‌డ‌ని జ‌గ‌న్ ఎత్తులు..!

0

ఏపీలో అధికార ప‌క్షం వేగంగా పావులు క‌దుపుతోంది. చంద్ర‌బాబుని సంపూర్ణంగా డిఫెన్స్ లోకి నెడుతోంది. వేగంగా ఎత్తులు వేస్తూ విప‌క్షాన్ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇది ప్ర‌తిప‌క్ష నేత‌, ఎంతో అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకి సైతం మింగుడుప‌డ‌క‌పోవ‌డం విశేషం. పార్టీని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ప్ప‌టికీ సొంత మ‌నుషులే చేజారుతున్న వేళ మాజీ సీఎంకి ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇక త్వ‌ర‌లో టీడీపీ క‌నుమ‌రుగవుతుందంంటూ వ‌ల్ల‌భ‌నేని వంశీ లాంటి వారి వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దేవినేని అవినాష్ కూడా గోడ‌దూకేయ‌డం, త్వ‌ర‌లో గొట్టిపాటి ర‌వి క్యూలో నిల‌వ‌డంతో టీడీపీకి వ‌రుస‌గా క‌మ్మ నేత‌లే హ్యాండిచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

వైఎస్ జ‌గ‌న్ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రెడ్డి, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి గ‌ట్టి బ‌లంగా నిలుస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో మెజార్టీ బీసీలు, బ్రాహ్మ‌ణ, క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గాలు కూడా బాగా క‌లిసి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ కొంద‌రు విమ‌ర్శ‌ల‌కు కూడా దిగారు. దాంతో క‌మ్మ నేత‌ల‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకోవ‌డం ద్వారా వాటిని తిప్పికొట్టాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ల‌ను వ‌రుస‌గా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

కాపుల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని మ‌రింత ప‌లుచ‌న చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న జ‌గ‌న్ , అదే స‌మ‌యంలో క‌మ్మ నేత‌ల‌ను ఆక‌ర్షించే య‌త్నంలో ఉన్నారు. ఇప్ప‌టికే కృష్ణా జిల్లాలో కీల‌క నేత‌లుగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని, దేవినేని కూడా జై జ‌గ‌న్ అనేశారు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాలో ఈ ప‌రంప‌ర ప్రారంభం కాబోతోంది. తొలుత గొట్టిపాటి ర‌వి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీ వైపు చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే మ‌రికొంద‌రు నేత‌లు కూడా టీడీపీని వీడ‌డం ఖాయం. ఇప్ప‌టికే చంద్ర‌బాబు దీక్ష‌కు స‌గం మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఢుమ్మా కొట్టారు. దాంతో అధినేత దీక్ష‌లో క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా ముందుకు రాని ఎమ్మెల్యేలు త్వ‌ర‌లో పూర్తిగా టీడీపీకి దూరం అయిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.

ఇది చంద్ర‌బాబుని మ‌రిన్ని చిక్కుల్లో నెడుతోంది. ప్ర‌భుత్వం మీద ఎదురుదాడి చేయ‌డం ద్వారా టీడీపీని కాపాడుకోవాల‌నే వ్యూహంలో ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు. అయినా వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌క‌పోవ‌డంతో టీడీపీ కోలుకుంటుందా అనే సందేహాలు పెంచుతోంది. సీనియ‌ర్ నేత‌లు కూడా బాబుకి దూరం అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతున్న నేప‌ధ్యంలో జ‌గ‌న్ ఎత్తుల‌కు ప్ర‌తిప‌క్షం విల‌విల్లాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here