ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీ: మ‌ళ్లీ తిక్క చూపిస్తాడ‌ట‌!

0

జ‌న‌సేన అధినేత‌గా గ‌డిచిన రెండేళ్లుగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం అయ్యింది. ఇటీవ‌ల సైరా సినిమాలో త‌న గొంతు వినిపించిన పీకే, మ‌రోసారి త‌న హీరోయిజం చూపించ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా ఏఎం ర‌త్నం స‌హా ప‌లువురు నిర్మాత‌లు గ్రీన్ సిగ్న‌ల్ కోసం క్యూ లో ఎదురుచూస్తున్నారు.

అయితే ఎన్నిక‌ల‌కు ముందు మైత్రీ మువీ మేక‌ర్స్ సంస్థ‌తో సినిమా చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంగీక‌రించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు అడుగులు ప‌డుతున్న‌ట్టుగా ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఆయ‌న రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆగిన ప్రాజెక్ట్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే ఎన్నిక‌ల త‌ర్వాత మైత్రీ సంస్థ ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. అందులో భాగంగా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని వినికిడి.

నా కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది ఈ డైలాగ్ విన‌గానే ఠ‌క్కున గుర్తుకొచ్చే సినిమా గ‌బ్బ‌ర్ సింగ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో రూపొంది 2012లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు. అయితే సినీ వ‌ర్గాల లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మ‌రోసారి ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ రిపీట్ కానుంద‌ని తెలు
స్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here