ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని కాలేదా..!?

0

జ‌న‌సేన అధినేత హ‌స్తిన‌కు వెళ్లారు. అయినా అక్క‌డ ఏం చేస్తున్నార‌న్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి రెండు రోజులు గ‌డిచినా కీల‌క నేత‌ల ద‌ర్శ‌నం ద‌క్కిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధాన‌మంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షాతో ఆయ‌న భేటీ అయ్యే అవ‌కాశం ఉందంటూ ఇప్ప‌టికే జ‌న‌సేన ప్ర‌క‌టించింది. దానికి త‌గ్గ‌ట్టుగా అపాయింట్ మెంట్ దొరికిందా లేక దొరుకుతుందా అన్న‌ది ప్ర‌స్తుతానికి ఆపార్టీకూడా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇది జ‌న‌సేన శ్రేణుల్లో సందేహాలు క‌లిగిస్తోంది. హ‌స్తిన వ‌ర‌కూ వెళ్లిన త‌మ పార్టీ అధ్య‌క్షుడి ప‌ట్ల కేంద్రంలోని పెద్దలు క‌నిక‌రిస్తారా లేదా అన్న‌ది వారిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరులో స్ప‌ష్ట‌త క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలు, బీఎస్పీ తో జ‌త‌గ‌ట్టి బ‌రిలో దిగి ఘోర ప‌రాజ‌యం చవి చూసిన త‌ర్వాత ఆయా పార్టీల‌తో క‌నీసం కూడా క‌లిసిన దాఖ‌లాలు లేవు. మ‌ర్యాద‌పూర్వ‌కంగానైనా ఎన్నిక‌ల ఫ‌లితాల మీద క‌లిసి చ‌ర్చించిన ఆన‌వాళ్లు లేవు. ఈ నేప‌థ్యంలో విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌రిగిన లాంగ్ మార్చ్ సంద‌ర్భంగా త‌న‌కు మోడీతో సాన్నిహిత్యం ఉంద‌ని, ప్ర‌ధాన‌మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానంటూ జ‌గ‌న్ స‌ర్కార్ ని హెచ్చ‌రించారు. త‌ద్వారా తాను మ‌ళ్లీ బీజేపీతో దోస్తీ చేయ‌డానికి సిద్ధ‌మే అన్న‌ట్టుగా సంకేతాలు ఇవ్వ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు ఖాయం అనే అభిప్రాయం వినిపించింది. బీజేపీ, జ‌నసేన స్నేహం మ‌ళ్లీ చిగురించ‌డానికి త‌గ్గ‌ట్టుగా తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌నే అంచ‌నాలు కూడా వేశారు. డొక్కా సీత‌మ్మ ఆహార కేంద్రాల పేరుతో చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ప్రారంభించిన వెంట‌నే అనూహ్యంగా నాదెళ్ల మ‌నోహ‌ర్ తో క‌లిసి ప‌వ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌డంతో ఈ చ‌ర్చ‌కు ఆస్కారం ఏర్ప‌డింది.

గ‌తంలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇదే రీతిలో బీఎస్పీ అధినేత్రితో స‌మావేశం కోసం ల‌క్నో వెళ్లిన నేప‌థ్యంలో అక్క‌డ కూడా రెండు రోజులు ఎదురుచూపులు త‌ప్ప‌లేదు. ఎన్నిక‌ల ముందు మాయావ‌తితో భేటీ త‌ర్వాత ఏపీలో బీఎస్పీతో క‌లిసి జ‌న‌సేన బ‌రిలో దిగ‌డానికి దోహ‌దం చేసింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో బీజేపీ పెద్ద‌లు జేపీ న‌డ్డాతో జ‌న‌సేనాని స‌మావేశం అయిన‌ట్టు చెబుతున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ బీజేపీతో క‌లిసి సాగ‌డానికి అనువుగా ఈ వ్య‌వ‌హారం సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీలో జ‌న‌సేన‌ను విలీనం చేయ‌మ‌ని గ‌తంలోనే త‌న‌పై అమిత్ షా ఒత్తిడి తీసుకొచ్చిన‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌టించారు. దాంతో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య మ‌ళ్లీ చిగురుస్తున్న స్నేహం ఎలా ఉంటుంద‌న్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌క‌మే. ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ మాదిరిగా ఒక్క‌ట‌వుతారా లేక గ‌తంలో పొత్తు పొట్టుకున్న‌ట్టుగా జ‌న‌సేన‌, బీజేపీ ఐక్యంగా బ‌రిలో దిగుతారా అన్న‌దే ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌కం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here