ప్ర‌భాస్ ‘సాహో’ మువీ రివ్యూ

  0

  సినిమా: సాహో
  న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాప్‌, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ప్ర‌కాశ్ బ‌ల్దేవ్‌, ఎవ్లిన్ శ‌ర్మ‌, సుప్రీత్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, టిను ఆనంద్‌
  మ్యూజిక్: జిబ్రాన్‌
  నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
  క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌

  బాహుబ‌లి త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా ఏకంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అతిపెద్ద బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ట్రైలర్, పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. సాహో ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా, ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మెప్పించాడా

  కథ
  ముంబై లో జరిగిన 2000 కోట్ల దొంగతనంతో మొదలై 2 లక్షల కోట్ల చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కథ. సెకండ్ హాఫ్ నుంచి గాంగ్ స్టర్ లు ఉండే వాజీ సిటి మీదకి సినిమా స్టోరీ టర్న్ అవుతుంది. ప్రభాస్ ఎవరు? దొంగా? పోలీసా? పోలీస్ ఆఫీసర్ అయిన అమృతా నాయ‌ర్ (శ్ర‌ద్ధాక‌పూర్‌)తో ఎలా ప్రేమ‌లో ప‌డ‌తాడు. చివ‌ర‌కు అశోక్ గురించి ఆమెకు తెలిసే షాకింగ్ నిజం ఏంటి?
  ఇక ముంబైలో జ‌రిగిన దొంగ తనానికి ప్ర‌భాస్‌కు సంబంధం ఏంటి, చివ‌ర్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌చ్చే సిద్ధార్థ‌రామ్ సాహో ఎవ‌రు ? అన్న‌ది తెరపై చూడాలి. ఏం రివీల్ చేసినా మీ ఆసక్తి పోతుందని… కథ గురించి ఇక్కడితో ఆగిపోతున్నాం.

  ప్ల‌స్
  -ప్ర‌భాస్

  • స్క్రీన్ ప్లే
  • విల‌న్ క్యారెక్ట‌ర్

  మైన‌స్
  -ప్ర‌భాస్, శ్ర‌ద్ధ కెమిస్ట్రీ కుద‌ర‌క‌పోవ‌డం

  • పాట‌లు
  • కామెడీ కుద‌ర‌క‌పోవ‌డం

  విశ్లేషణ:
  దాదాపు ముఖ్య పాత్రలు అన్నీ కూడా ఫస్టాఫ్ లోనే పరిచయం చేసిన ద‌ర్శ‌కుడు..ఆ ప‌రిచ‌యం చేయ‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డాడు. క‌థ‌ను మెయిన్ ట్రాక్‌లోకి ఎక్కించేందుకే దాదాపుగా గంట సేపు తీసుకుంటాడు… ఇక్కడ టైం కిల్ అయ్యింది. ప్రభాస్ మరియు శ్రద్దాల మధ్య కెమిస్ట్రీ గొప్ప‌గా లేదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. విజువల్స్ మాత్రం ఈ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఎక్క‌డా లేని ఆస‌క్తి క్రియేట్ అవుతుంది.

  ద‌ర్శ‌కుడు సుజీత్ సింపుల్ క‌థ తీసుకుని దాని చుట్టూ యాక్ష‌న్ అల్లుకోవ‌డంతో సినిమా అంతా యాక్ష‌న్ డామినేష‌న్ ఎక్కువైంది. ట్విస్టులు, యాక్ష‌న్‌కు ఇచ్చిన ప్ర‌యార్టీ రొమాన్స్‌, కామెడీ, ఎమోష‌న‌ల్‌కు ఇవ్వ‌లేదు. దీంతో తెర‌పై కామెడీ, ఎమోష‌న‌ల్‌, రొమాంటిక్ సీన్లు వ‌స్తున్నా ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేక‌పోయాడు. కాకపోతే ఆ విజువల్ వండర్, యాక్షన్ సన్నివేశాలు ఆ పొరపాట్లను మరిచిపోయేలా చేస్తాయి. ఇంట‌ర్వెల్ నుంచి సినిమా ఇంకా లేస్తుంది.

  యాక్షన్ ఎపిసోడ్ లు బాగా రాసుకున్న దర్శకుడు దాని చుట్టూ కథ రాసుకోవడంలో తడబడ్డాడు… ఆఖరి నలభై నిమిషాలతో ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. ద‌ర్శ‌కుడు సుజీత్ సింపుల్ స్టోరీకి యాక్ష‌న్ అల్లేశాడు. బేసిగ్గా యాక్షన్ సినిమా కాబట్టి హింస కాస్త ఎక్కువైంది. కథలో కాకుండా యాక్షన్ తోనే సంతృప్తి చెందాలి.

  రేటింగ్‌: 3/ 5

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here