న‌ల్ల‌మ‌ల కోసం న‌డంక‌ట్టిన శేఖ‌ర్ క‌మ్ముల‌

0

క్లాసిక‌ల్ సినిమాల‌తో ప‌లువురిని ఆక‌ట్టుకున్న శేఖ‌ర్ క‌మ్ముల మ‌రోసారి త‌న సామాజిక స్పృహ‌ను చాటుకున్నాడు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌లో త‌న దృక్ప‌థాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ప్ర‌య‌త్నించిన శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌స్తుతం న‌ల్ల‌మ‌ల స‌మ‌స్య‌పై స్పందించారు. సేవ్ న‌ల్ల‌మ‌ల అంటూ నిన‌దించారు. యురేనియం తవ్వ‌కాల‌పై గొంతు విప్పారు. ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్షించాలంటూ డిమాండ్ చేస్తూ త‌న వాద‌న‌ను ట్వీట్ చేశారు.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ సాగుతోంది. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలకు మ‌ద్ధ‌తుగా సినీ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కూడా క‌దిలారు.

‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here