నాకు శ‌త్రువులు ఎక్కువ‌..బాట ముళ్ల‌బాట‌

0

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తొలిసారిగా ప్ర‌కాశం జిల్లాలో ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ది కోసం రూపొందించిన నాడు నేడు కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

దేశ‌మంతా ఉద్యోగాలు కోల్పోతున్న దశ‌లో ఏపీలో నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న చెప్పుకున్నారు. గ్రామ స‌చివాల‌యాలు, వాలంటీర్ల ఉద్యోగాలు ద్వారా యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు. పిల్ల‌లంద‌రికీ మెరుగైన భ‌విత‌వ్యం కోస‌మే తాను ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు తెలిపారు. నాలుగేళ్ల‌లో విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత కాలేజీల అభివృద్ధి చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం 76శాతం మంది పాఠ‌శాల స్థాయికే ప‌రిమితం అవుతున్నార‌ని, దానిని మార్చుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ తాను మంచి చేయాల‌ని చూస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ప‌లువురు అడ్డు త‌గులుతున్నార‌ని వాపోయారు. త‌న‌కు శ‌త్రువులు ఎక్కువ‌గా ఉన్నార‌ని తెలిపారు. వారంతా క‌లిసి ఆటంకాలు పెట్టాల‌ని చూస్తున్నార‌ని, ఆయినా తాను ముంద‌కు సాగుతాన‌న్నారు. త‌న‌ది ముళ్ల‌బాట అని తెలుస‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ఆశీస్సులు, దేవుడి ఆశీర్వాదంతో ముంద‌కు వెళ‌తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here