తెలుగు మీడియాలో తెలంగాణా చానెళ్ల హ‌వా

0

తెలుగు మీడియా న్యూస్ చానెళ్ల‌లో తెలంగాణా చానెళ్ల హ‌వా క‌నిపిస్తోంది. రేటింగ్స్ విష‌యంలో ఆయా చానెళ్లు దూసుకుపోతున్నాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లోనూ ప్ర‌సార‌మ‌వుతున్న చానెళ్ల క‌న్నా ముందు నిలుస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. కేవ‌లం తెలంగాణాకే ప‌రిమితం అయిన చానెళ్లు విశేషంగా జీఆర్పీలు సాధించ‌డం విశేషంగా మారుతోంది.

తాజాగా 45వ వారానికి సంబంధించిన రేటింగ్స్ ప‌రిశీలిస్తే అగ్ర‌స్థానంలో టీవీ9 ఉండ‌గా, ఆ త‌ర్వాతి రెండు స్థానాల‌ను వీ6, టీ న్యూస్ సాధించ‌డం ఆస‌క్తిక‌రం. టీవీ5, ఎన్టీవీ, సాక్షి, ఈటీవీ, 10టీవీ వంటివి త‌ర్వాతి స్థానాల్లో ఉండ‌గా వీ6, టీ న్యూస్ త‌డాఖా చూపుతున్న తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌భిస్తున్న జీఆర్పీల ద్వారానే ఈరెండు చానెళ్ల‌కు మంచి రేటింగ్స్ రావ‌డానికి ప్రధాన కార‌ణంగా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ రెండు రాష్ట్రాల్లో ప్ర‌సార‌మ‌వుతున్న వారిని మించి రేటింగ్ పాయింట్లు సాధించ‌డం మాత్రం ఆస‌క్తిక‌ర అంశ‌మే. పైగా ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారిగా జ‌రిగింద‌ని చెబుతున్నారు.

రేటింగ్స్ ఇలా ఉన్నాయి..

  1. TV9 Telugu 58984
    2 V6 News 35137
    3 T News 30729
    4 NTV Telugu 30723
    5 TV 5 News 26517

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here