టీడీపీకి షాక్:జ‌గ‌న్ తో చేతులు క‌లిపిన బీదా

0

బీదా మ‌స్తాన్ రావు. నెల్లూరు టీడీపీలో కీల‌క నేత‌. పారిశ్రామిక‌వేత్త‌గా రాణిస్తూ టీడీపీ వ్య‌వ‌హారాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈయ‌న ఇప్పుడు దృష్టి మ‌ర‌ల్చిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో సీఎం జ‌గ‌న్ పర్య‌ట‌న‌కు హాజ‌రుకావ‌డంతో ఇప్పుడు ప్ర‌చారం ఊపందుకుంది. ఆయ‌న టీడీపీ ని వీడుతున్న‌ట్టు సొంత పార్టీ శ్రేణుల్లోనే జోరుగా ప్ర‌చారం సాగుతుండ‌డం విశేషం.

గ‌తంలో ఎంపీగానూ, మొన్న‌టి ఎన్నిక‌ల్లో కావ‌లి స్థానం నుంచి బ‌రిలో దిగిన బీదా కుటుంబంలో బీఎమ్మార్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అయితే ఆయ‌న వైసీపీ మంత్రి ఆహ్వానంతో నేరుగా సీఎం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. ఆయ‌న తోసిపుచ్చుతున్న‌ప్ప‌టికీ ఎవ‌రూ విశ్వ‌సించ‌లేని ప‌రిస్థితి కనిపిస్తోంది. మ‌త్స్య ఉత్ప‌త్తుల వ్యాపారంలో ఉండ‌డంతోనే తాను సీఎం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్టు చెబుతున్న బీఎమ్మార్ త‌న‌కు మంత్రి మోపిదేవి నుంచి ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందిన‌ట్టు వెల్ల‌డించారు.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీలో కూడా ఆయ‌న‌కు స్థానం ద‌క్కింది. మత్స్య రంగ అభివృద్ధికి బీఎంఆర్‌ సంస్థ చేస్తున్న కృషిని తెలుసుకున్న సీఎం తనను మత్స్యకార పాలసీ కమిటీలో సభ్యుడిగా ఉండాలని కోరారని, దానికి తాను అంగీకరించిన‌ట్టు కూడా బీఎమ్మార్ చెబుతున్నారు. దానికి మించి ఈ విష‌యంలో రాజ‌కీయాలు లేవ‌ని ఆయ‌న చెబుతున్నారు.

కానీ సీఎం మీటింగ్ కోసంప‌నిగ‌ట్టుకుని నెల్లూరు నుంచి అమ‌లాపురం వ‌ర‌కూ వెళ్ల‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ క‌మిటీలో ప‌ద‌వి అంగీక‌రించ‌డం గ‌మ‌నిస్తుంటే ఇక బీఎమ్మార్ జెండా మారుతున్న‌ట్టున‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here