టీడీపీకి మ‌రో షాక్: పార్టీ మారే యోచ‌న‌లో మాజీ ఎంపీ

0

సుజ‌నా చౌద‌రి పై బ్యాంకుల వ్య‌వ‌హారాల కేసు వ‌చ్చింది. కొద్దికాలం కేంద్ర‌మంత్రిగా ఉండ‌గా కాలం సాగ‌దీశారు. కానీ ఏపీలో అధికారం పోగానే ఆయ‌న కాషాయ కండువా క‌ప్పేసుకున్నారు. సీఎం ర‌మేష్ పై ఐటీ దాడులు ఎక్కుపెట్టారు. ఆయ‌న కూడా టీడీపీ చేతుల్లోంచి అధికారం పోగానే క‌మ‌లం పంచ‌న చేరిపోయారు. ఇప్పుడు అదే వ‌రుస‌లో రాయ‌పాటి సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఈ మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ట్రాన్స్ ట్రాయ్ వ్య‌వ‌హారాల‌పై సీబీఐ గురి ఎక్కుపెట్టింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థ‌గా ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు ఆధారాలు దొరికిన‌ట్టు స‌మాచారం గుప్పుమంది.

ఈ ప‌రిణామాల‌తో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా సుర‌క్షితంగా ఉండాలంటే మోడీకి జై కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డానికి రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు అంతా భావిస్తున్నారు. దానికి సంబంధించి ఆయ‌న స్పంద‌న కూడా అదే రీతిలో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీ కి మ‌రో షాక్ త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం సాగుతోంది.

పార్టీ మార‌డంపై వివ‌ర‌ణ కోరిన విలేక‌ర్ల‌కు రాయ‌పాటి స‌మాధానం చెబుతూ ప్ర‌స్తుతానికి అలాంటి ఆలోచ‌న లేద‌ని, త్వ‌రలోనే ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూటిగానే చెప్పేశారు. సీబీఐ దాడులు చేసిన ట్రాన్స్ ట్రాయ్ తో త‌న‌కు సంబంధం లేద‌ని చెప్పిన రాయ‌పాటి తాను పార్టీ మార‌బోతున్న‌ట్టు సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా స‌ద‌రు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డే యోచ‌న‌లో ఉన్న‌ట్టు అంతా భావిస్తున్నారు. ఏమ‌యినా దేశంలో ఎవ‌రు ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డినా మోడీ జిందాబాద్ అంటే అంద‌రికీ మోక్షం క‌లిగే కొత్త ప‌థ‌కం ఒక‌టి ప్రారంభించిన‌ట్టుగా ఈ వ‌రుస ప‌రిణామాలు చాటుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here