జ‌గ‌న్ స‌ర్కార్ కి షాకిచ్చిన ‘ఆశా’

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తొలి సంత‌కాల‌లో ఒక‌టైన ఆశా వ‌ర్క‌ర్ల గౌర‌వ వేత‌నాల పెంపుదల వ్య‌వ‌హారం పెద్ద వివాదానికి దారితీసింది. సీఎం మాట‌కు, చేత‌ల‌కు పొంత‌న లేక‌పోవ‌డంతో పెద్ద సంఖ్య‌లో ఆశాలు త‌మ ఆగ్ర‌హాన్ని వెళ‌ల్గ‌క్కారు. ప్ర‌భుత్వ తీరు మీద తీవ్రంగా మండిప‌డుతూ విజ‌య‌వాడ‌లో నిర‌స‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాన్ని ప‌లువురు మ‌హిళ‌లు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌హిళ‌లు స్వ‌రం వినిపించ‌డంతో దానిని సొమ్ము చేసుకునేందుకు టీడీపీ నేత‌లు రంగంలో దిగారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌న‌వ‌రి నుంచే ఆశాల వేత‌నాలు పెండింగ్ లో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు , ఆయ‌న త‌న‌యుడు స‌హా టీడీపీ నేత‌లంతా ఆశాల మీద సానుభూతి ప్ర‌ద‌ర్శిస్తూ ట్వీట్లు సంధించారు.

ఈ వ్య‌వ‌హారం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. చేసిన సంత‌కాలు తడి ఆర‌క‌ముందే ఆశా వ‌ర్క‌ర్ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతున్న‌ట్టు గ్ర‌హించింది. దాంతో త‌క్ష‌ణం స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా ఆశా వ‌ర్క‌ర్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో చిత్త‌శుద్ధితో ఉన్న‌ట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. “ఆశావ‌ర్క‌ర్ల‌కు ఎలాంటి గ్రేడింగ్ లేదు. ఎలాంటి పాయింట్ల వ్య‌వ‌స్థ లేదు. సెప్టెంబ‌ర్ నుంచి అంద‌రికీ రూ.10వేలు చెల్లిస్తాం. అధికారంలోకి వ‌చ్చిన 3 నెల‌ల్లోనే ఆశావ‌ర్క‌ర్ల హామీల‌ను అమ‌ల్లోకి తెచ్చాం”అంటూ మంత్రి తేల్చిచెప్పారు.

గ‌తంలో కూడా హామీలు గుప్పించినా ఆచ‌ర‌ణ‌లోకి నోచుకోక‌పోవ‌డంతోనే ఈ స‌మ‌స్య వ‌చ్చింది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం వాస్త‌వాలు చెప్పి, వారిని ఒప్పించే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచిది. అందుకు భిన్నంగా సాగితే ఆశాల వంటి క్షేత్ర‌స్థాయి మ‌హిళ‌ల కార‌ణంగా ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి అనివార్యం అనే అభిప్రాయం వినిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here