జ‌గ‌న్ కి ఇన్ ఫ్రంట్ క్రోక‌డైల్ ఫెస్టివ‌ల్!

0

ఏపీ సీఎం జ‌గ‌న్ అనూహ్య మెజార్టీతో అధికారం చేప‌ట్టారు. అయినా గ‌డిచిన మూడు నెల‌లుగా ఆయ‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు మెజార్టీ ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇసుక వ్య‌వ‌హారం అంద‌రినీ నిరాశ ప‌రిచింది. అన్నా క్యాంటీన్ల మూసివేత జ‌నాగ్ర‌హానికి కార‌ణం అయ్యింది. క‌క్ష సాధింపు ధోర‌ణితో సాగుతున్నార‌నే అబిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. అమ‌రావ‌తి, పోల‌వ‌రం ప‌నులు నిలిచిపోవ‌డంతోనూ అనుమానాలు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి అనేక స‌మ‌స్య‌ల మ‌ధ్య ప్ర‌స్తుతం సంక్షేమ మంత్రం ప‌ఠిస్తూ జ‌గ‌న్ స‌ర్కారు ముందుకెళుతోంది. న‌వ‌ర‌త్నాల‌తో జ‌నాల‌ను సంతృప్తి ప‌రిచే రీతిలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు తీసుకెళ్లేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీ ల‌క్ష్యాల‌తో ముందుకు సాగుతుంటే వాస్త‌వ చిత్రం మాత్రం వేరుగా ఉంది. ఏపీలో ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా క‌నిపిస్తోంది. అప్పుల‌కుప్ప‌లా ఉంది. చంద్ర‌బాబు స‌ర్కారు తీరుతో ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్థిక భారం త‌ప్ప‌డం లేదు. జ‌గ‌న్ కి ఈ ప‌రిస్థితులు మింగుడుప‌డ‌డం లేదు. అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి స‌హ‌కారం కూడా క‌నిపించ‌డం లేదు. బీజేపీ పెద్ద‌లు ఆంధ్రాలో విమ‌ర్శ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త హ‌స్తిన నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఇస్తున్న దాఖ‌లాలు లేవు. దాంతో రామ్ మాధ‌వ్, జీవీఎల్ వంటి తీరు విస్మ‌య‌క‌రంగానూ వైసీపీ స‌ర్కారుకి మింగుడుప‌డ‌ని విధంగా మారుతున్నాయి.

అన్నింటికీ మించి ఆర్థిక‌మాంధ్యం ప‌రిస్థితులు జ‌గ‌న్ కి పెద్ద ఆటంకంగా మారే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. రాబ‌డులు పూర్తిగా త‌గ్గిపోయే దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వానికి ఆర్థిక వెసులుబాటు పూర్తిగా కోల్పోయే పరిణామాలు దాపురిస్తున్నాయి. దాంతో రోజు వారీ వ్య‌వ‌హారాల‌కు కూడా ప్ర‌భుత్వ నిధులు స‌రిపోతాయో లేదోన‌నే సందేహాలు మొద‌ల‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతున్న త‌రుణంలో ఈ స‌మ‌స్య‌మ‌రింత ముదురుతున్న వాతావ‌ర‌ణం ఉంది. దాంతో జ‌గ‌న్ భారీగా ప్ర‌జాసంక్షేమానికి విడుద‌ల చేయాల‌నుకుంటున్న నిధుల‌కు ఇక్క‌ట్లు త‌ప్పేలా లేదు. దాంతో ఇలాంటి అర్థిక ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్క‌డం అంత చిన్న విష‌యం కాదు. ముందున్న మొస‌ళ్ల పండుగ లాంటి ప‌రిస్థితిని అధిగ‌మించేందుకు స‌ర‌యిన ప్ర‌ణాళిక‌తో వెళ్ల‌క‌పోతే అస‌లేం అంతంత‌మాత్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here