జ‌గ‌న్ ఇరుక్కున్న‌ట్టేనా?

0

ఏపీ సీఎం జ‌గ‌న్ సందిగ్ధంలో ప‌డ్డారు. రాజ‌ధాని విష‌యంలో ముందుకా వెన‌క్కా అన్న‌ది ఎటూ తేల్చ‌కుండా జాప్యం చేసేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ముఖ్యంగా వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌తో పున‌రాలోచ‌న దిశ‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కానీ వాస్త‌వానికి జ‌గ‌న్ ఒక నిర్ణ‌యం తీసుకునే ముందు ఆలోచించ‌డ‌మే త‌ప్ప‌, నిర్ణ‌యం జ‌రిగిన త‌ర్వాత వెన‌క్కి త‌గ్గే అవ‌కాశాలుండ‌వు. జ‌గ‌న్ గురించి తెలిసిన వారంద‌రూ అంగీక‌రించే వాస్త‌వం ఇది.

రాజ‌ధాని అంశంలో కూడా ఆయ‌న అందుకు త‌గ్గ‌ట్టుగానే ముంద‌కు సాగే అవ‌కాశాలున్నాయి. అయితే ప‌రిస్థితిలో కొంత మార్పు త‌ప్ప‌ద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. విశాఖ‌తో పాటుగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న మీద తీవ్రంగా వ్య‌తిరేక‌త వస్తోంది. క‌ర్నూలులో హైకోర్ట్ విష‌యంపై జ‌గ‌న్ కి సంపూర్ణ‌ మ‌ద్ధ‌తు ఉంది. మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా క‌ర్నూలు విష‌యంలో ప‌ల్లెత్తుమాట అన‌గ‌లిగే ప‌రిస్థితి లేదు.

కానీ అమ‌రావ‌తిలో అసెంబ్లీ, విశాఖ‌లో సెక్ర‌టేరియేట్ అన‌గానే చాలామంది నుంచి భిన్న‌వాద‌న‌లున్నాయి. అసెంబ్లీ ఒక‌చోట‌, సెక్ర‌టేరియేట్ మ‌రో చోట ఉంటే పాల‌న స‌మ‌న్వ‌యం సాధ్యం కాద‌ని, గ‌తంలో ఎక్క‌డా లేని ఇలాంటి ప్ర‌యోగం ఫ‌లించ‌ద‌ని నిపుణులు సైతం చెబుతున్నారు. దాంతో అన్నింటికీ విశాఖ‌ను రాజ‌ధానిగా మార్చ‌డ‌మే ఉత్తమం, లేదంటే అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌నే వారు క‌నిపిస్తున్నారు. కానీ జ‌గ‌న్ మాత్రం భిన్న‌మైన దృక్ప‌థంతో ఉన్న త‌రుణంలో విష‌యం ఎక్క‌డికి దారితీస్తుంద‌న్న‌దే అనుమానాలు రేకెత్తిస్తోంది.

విశాఖ‌లో మావోయిస్టుల ప్ర‌భావం ఉంటుంద‌ని పోలీస్ వ‌ర్గాలు నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు తెలుస్తోంది. అంతేగాకుండా హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావ‌తి కేంద్రంగా కొంత మౌలిక స‌దుపాయాలు సిద్ధం చేసుకున్న త‌ర్వాత మ‌రోసారి త‌ర‌లింపు శ్రేయ‌స్క‌రం కాద‌ని చెప్ప‌డం విశేషంగా మారింది. అంతేగాకుండా రాయ‌ల‌సీమ వాసుల‌కు విశాఖ పెద్ద భారంగా మారుతుంది. సెక్ర‌టేరియేట్ లో అంద‌రికీ అవ‌స‌రం లేన‌ప్ప‌టికీ, స‌మ‌స్య‌ల మీద విన్న‌వించుకోవ‌డానికి వెళ్లే వారికి మాత్రం విశాఖ దూరాభారంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ కోణంలోనే సీమ‌లో ప‌లువురు సామాన్యులు సైతం విశాఖ‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో హైప‌వ‌ర్ క‌మిటీతో పాటు బీసీజీ కూడా మూడు రాజ‌ధానుల‌కు సై అంటాయ‌న‌డంలో సందేహం లేదు. కానీ అడుగులు వేయ‌డ‌మే అస‌లుస‌మ‌స్య‌. అలాంటి ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకే ఇప్పుడు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. మ‌రి చివ‌ర‌కు రాజ‌ధాని విష‌యంలో ఇరుక్కుంటారా.. లేక రాష్ట్రాన్ని గ‌ట్టెక్కిస్తారా అన్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here