క‌న్న‌బాబుని ముఖ్య‌మంత్రి చేసిన అంబ‌టి రాంబాబు

0

ఏపీలో రాజ‌కీయాల్లో మంచి వాగ్దాటి ఉన్న నేత‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఒక‌రు. మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న‌కు ఆర్టీసీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే వైసీపీ మీద , జ‌గ‌న్ మీద ఎవ‌రు విమ‌ర్శ‌లు చేసినా సూటిగా వాటిని ఎదుర్కోవ‌డంలో అంబ‌టిది అందెవేసిన చేయి. అలాంటి సీనియ‌ర్ నేత కూడా త‌డ‌బ‌డ్డారు. ఫ్లో లో ఏదో చెప్పాల‌నుకుని ఇంకేదో చెప్పేసిన తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

లాంగ్ మార్చ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ భ‌గ్గుమంటోంది. వ‌రుస‌గా ఆపార్టీ నేత‌లు మీడియా స‌మావేశాల‌తో త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. విశాఖ నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కూ వ‌రుస‌గా ప‌లువురు నేతలు మీడియా ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వంటి వారు కొంత ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌గా, అంబ‌టి రాంబాబు త‌న‌దైన శైలిలో ప‌వ‌న్ మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఎదురుదాడి చేశారు.

మంత్రి క‌న్న‌బాబు మీద ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ని అంబ‌టి రాంబాబు త‌ప్పుబ‌ట్టారు. ఆ క్ర‌మంలోనే క‌న్న‌బాబు మీద విమ‌ర్శ‌లు చేసే హ‌క్కు ప‌వ‌న్ కి లేదంటూ ఏపీ ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న క‌న్న‌బాబు మీద విమ‌ర్శ‌లు చేస్తారా అంటూ అంబ‌టి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కొన్నిసార్లు నాయ‌కులు త‌మ మాటల్లో ఇలాంటి త‌త్త‌ర‌బాటు సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా యుగంలో అవే పెద్ద సంచ‌ల‌నంగా మారుతున్నాయి. సామాన్యుల్లో చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి. తాజాగా అలాంటి జాబితాలో అంబ‌టి చేరిపోవ‌డం విశేష‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here