కోహ్లీ టాప్ కి స్మిత్ ఎస‌రు పెడ‌తాడా?

0

ఆస్ట్రేలియ‌న్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూప‌ర్ ఫామ్ లో కొన‌సాగుతున్నాడు. వ‌రుస టెస్టుల్లో ఇంగ్లాండ్ టీమ్ కి చుక్క‌లు చూపిస్తున్నాడు. యాషెస్ సిరీస్ లో విజృంభిస్తున్నాడు. దాంతో ఐసీపీ ర్యాంకింగ్స్ లో దూసుకు వ‌స్తున్నాడు.

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 922 పాయింట్లతో టాప్ లోనే ఉన్నాడు. కానీ స్టీవ్ స్మిత్ 913 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 887 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.

కోహ్లీ కంటే స్మిత్ 9 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉండడంతో అతడి స్థానానికి ఎసరు తప్పేలా లేదు.
కోహ్లీ తర్వాత టాప్-10లో ఒక్క చతేశ్వర్ పుజారా మాత్రమే భారత్ నుంచి చోటు దక్కించుకోగలిగాడు. 881 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 770 పాయింట్లతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోలస్ ఐదో స్థానంలో ఉన్నాడు.

టెస్టు జట్లలో భారత్ (113) తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకోగా, న్యూజిలాండ్ (111), దక్షిణాఫ్రికా (108)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

బౌలర్ల విభాగంలో రవీంద్ర జడేజా ఒక స్థానం ఎగబాకి 794 పాయింట్లతో ఐదో స్థానం దక్కించుకున్నాడు. లార్ట్స్ టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ 914 పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్లలో జడేజా (387) మూడో స్థానంలో నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ 321 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here