కొత్త రికార్డుల దిశ‌లో బంగారం

0

బంగారం ప‌రుగులు పెడుతోంది. సామాన్యుడికి మ‌రింత దూరం అవుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక‌మాంద్యం సూచ‌న‌ల నేప‌థ్యంలో అంద‌రూ బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో అంత‌ర్జాతీయంగా బులియ‌న్ మార్కెట్ లో ధ‌ర‌లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. కొత్త రికార్డుల దిశ‌లో సాగుతోంది.

తాజాగా బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్‌టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గకపోవడంతో పసిడి ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ఏకంగా రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది.

దేశీయంగా బంగారం డిమాండ్ భారీగా ఉంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంది. రూపాయి బలహీన పడుతుండటం కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here