కేసులో ఇరుక్కున్న ఎంఎస్ ధోనీ

0

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇబ్బందుల్లో ప‌డుతున్నారు. ఆర్థిక నేరాల కేసుల్లో ఆయ‌న ఇరుక్కున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఎఫ్ ఐ ఆర్ కూడా న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అమ్రాపాలీ కుంభ‌కోణంలో ధోనీ పాత్ర‌పై చాలాకాలంగా ఆరోప‌ణ‌లున్నాయి. ఆయ‌న భార్య సాక్షి పాత్ర ఉండ‌డంతో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

ఆమ్రపాలి స్కామ్ కుట్రలో ధోనీకి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించిన ఆమ్రపాలి గ్రూప్‌ బాధితులు.. ఎఫ్‌ఐఆర్‌లో ధోని పేరును కూడా చేర్చారు. క్రికెటర్‌గా ధోనికి, బిల్డర్‌గా అనిల్‌ శర్మకు ఎంతో పేరుంది. వీరిపై నమ్మకంతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు సొమ్ములు చెల్లించామని బాధితులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సోమవారం దీనిపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఆమ్రపాలి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌నకు ధోని ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఫ్లాట్‌లు విక్రయిస్తామంటూ అనేక మంది వద్ద సొమ్ములు సేకరించిన సంస్థ ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా అనేక కంపెనీలకు మళ్లించింది.

ఇందులో ధోని భార్యకు చెందిన కంపెనీ కూడా ఉంది. అయితే, డిపాజిట్లు తీసుకున్న ఆమ్రపాలి కంపెనీ అగ్రిమెంట్‌ ప్రకారం ఓనర్లకు ఫ్లాట్లు అప్పజెప్పలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2017లో దీనిపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రజల నుంచి వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన సంస్థ ఆ మొత్తాన్ని వివిధ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు బదిలీ చేసినట్టు తేలింది. ప్రజలను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి డైరెక్టర్లు సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కంపెనీకి ధోని బ్రాండ​ అంబాసిడర్‌గా వ్యవహరించడమే అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి ప్రధాన కారణమైంది. ఈ గ్రూప్‌ ద్వారా ఇంటిని కొనుగోలు చేసిన పలువురు చేసిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకూ ఏడు ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here