కేసీఆర్ స‌ర్కారు చేతిలో చంద్ర‌బాబు గుట్టు!

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆస్తుల వివాదంలో కోర్టు మెట్లు ఎక్క‌క త‌ప్ప‌దా…చంద్ర‌బాబుకి సొంత కుటుంబ స‌భ్యులే వేసిన కేసులు చిక్కులు అనివార్య‌మే. అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. తాజాగా 14 ఏళ్ల కేసు ఫైళ్లు దులుపుతున్న స‌మ‌యంలో చంద్ర‌బాబుకి స‌మ‌స్య‌లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ల‌క్ష్మీపార్వ‌తి వేసిన కేసులో ఏసీబీ విచార‌ణ‌కు రంగం సిద్ధం కావ‌డంతో ఈ ప‌రిస్థితి త‌ప్పేలా లేదు. గ‌తంలో తీసుకున్న స్టే ని తొల‌గిస్తూ కోర్ట్ ఆదేశాలు జారీ చేయ‌డంతో ఏసీబీ రంగంలో దిగుతోంది.

గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండ‌గా ల‌క్ష్మీపార్వ‌తి ఫిర్యాదు చేశారు. అయితే అప్ప‌ట్లో హైద‌రాబాద్ హైకోర్ట్ ని చంద్ర‌బాబు ఆశ్ర‌యించ‌డంతో స్టే ల‌భించింది. కానీ తాజాగా స్టే తొల‌గించడంతో తెలంగాణా ఏసీబీ రంగంలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యింది. ఇది తెలుగుదేశం పార్టీ అధినేత కు ఇక్క‌ట్లు తెచ్చేలా క‌నిపిస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ స‌ర్కార్ తో ఇప్ప‌టికే చంద్ర‌బాబు కి స‌మ‌స్య‌లున్నాయి. ఇప్పుడు తాజాగా ఏసీబీ కేసు తెర‌మీద‌కు వ‌స్తున్న త‌రుణంలో మ‌రింత‌గా త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేదు.

వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల కేసులో తీవ్రంగా నింద‌లు మోపిన టీడీపీ నేత‌ల‌కు ఈ ప‌రిణామాలు మింగుడుప‌డే అవ‌కాశం లేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు కూడా అక్ర‌మంగా ఆస్తులు కూడ‌బెట్టుకున్నార‌నే కేసు ఎదుర‌వుతున్న వేళ ఎద‌టి ప‌క్షం మీద చేసే ఆరోప‌ణ‌ల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ల‌క్ష్మీపార్వ‌తి పేర్కొన్న ఆస్తుల‌కు ఇప్ప‌టికీ పొంత‌న ఉందా, ఇటీవ‌ల అధికారికంగా వెల్ల‌డించిన చంద్రబాబు ఆస్తుల సంగ‌తి ఏంటి అనేదే చ‌ర్చ‌నీయాంశం. ఏమ‌యినా ఇది టీడీపీ చీఫ్ కి కొత్త చికాకుగా మార‌బోతోంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం

ఇప్ప‌టికే తెలంగాణా ఏసీబీ ప‌రిధిలో చంద్ర‌బాబు కేసు మ‌రోటి కూడా ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు పాత్ర‌పై ఏసీబీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. కానీ కేసు విచార‌ణ మాత్రం ముందుకు సాగ‌లేదు. ఇప్పుడు ఈ విష‌యంలో తెలంగాణా ఏసీబీ తీరు ఎలా ఉంటుంద‌న్న దానిని బ‌ట్టి బాబు భ‌విత‌వ్యం ఆధాప‌డి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here