ఆ ఎంపీ జెండా పీకేయ‌డం ఖాయం..!

0

ఏపీలో అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ ప‌లువురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి క్యూ క‌ట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ ప‌డ‌వ‌కు చిల్లు పెట్టే ప‌ని సాగుతోంది. వైసీపీని వ్యూహాత్మ‌కంగా ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీ దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతోంది. ఈ వ్య‌వ‌హారంలో బీజేపీ ఉచ్చులో ప‌డిన వైసీపీ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామకృష్ణం రాజు త‌న పార్టీని, అధినేత‌ను ఇరుకున పెట్టే పని ప్రారంభించారు.

నేరుగా పార్ల‌మెంట్ లోనే ఈ ప్ర‌స్థానానికి శ్రీకారం చుట్టిన ర‌ఘురామ‌కృష్ణం రాజు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. వాస్త‌వానికి ఆయ‌న చాలాకాలంగా ప‌దే ప‌దే పార్టీలు మారుతూ, ఎక్క‌డ ఏపార్టీలో ఉన్నా కేంద్రంలోని పెద్ద‌ల‌తో స‌ఖ్య‌త‌ను కొన‌సాగిస్తున్నారు. అందులో భాగంగానే ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌తో ఆయ‌న స్నేహం నెరుపుతున్నారు. ఇది వైసీపీ అధిష్టానానికి కంట‌గింపుగా మారింది. ముఖ్యంగా పార్టీ నేత‌ల మాట‌ల‌ను ఖాత‌రు చేయ‌కుండా నేరుగా పీఎంవోలో వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టుకున్న తీరు వారికి రుచించ‌క‌పోవ‌డంతో ర‌ఘురామ‌కృష్ణం రాజుకి వైసీపీకి మ‌ధ్య గ్యాప్ కి కార‌ణం అవుతోంది.

ఈ గ్యాప్ మ‌రింత పెంచేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా పార్ల‌మెంట్ లో రాజుగారు బాగున్నారా అంటూ నేరుగా ప్ర‌ధాని ప‌ల‌క‌రించిన తీరు దానికో ఉదాహ‌ర‌ణ‌. గ‌తంలో విజ‌య‌సాయిరెడ్డిని అలా సంబోధించిన పీఎం ఈసారి ర‌ఘురామ‌కృష్ణం రాజుని పిలవ‌డం ద్వారా ఇద్ద‌రికీ స‌మాన ప్రాధాన్య‌త‌నేని చాటిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌తో ఈ ఎంపీకి మ‌రింత దూరం పెర‌గ‌డం దాదాపు ఖాయంగా చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో త‌న వ్య‌వ‌హారాన్ని తానే చ‌క్క‌బెట్టుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన ఆయ‌న దానికి త‌గ్గ‌ట్టుగా అటు జ‌న‌సేన‌, ఇటు బీజేపీ నేత‌ల‌తో మంచి స్నేహాన్ని నెరుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల నాటికి ఎటు శ్రేయ‌స్క‌రం అనుకుంటే అటు దూకేయ‌డానికి ఆయ‌న ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తుండంతో వైసీపీని వీడ‌బోయే తొలి నేత‌గా ఆయ‌న మార‌డం ఖాయ‌మ‌నే అనే వాద‌న‌లు కూడా పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here