అల వైకుంఠపురానికి అద‌నంగా అందాలు..!

0

టబు..ఒక‌నాటి హీరోయిన్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్రారంభించడానికి స‌న్న‌ద్ధ‌మ‌య్యింది. అందులో భాగంగా అల‌వైకుంఠాపురంతో రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఫ‌స్ట్ లుక్ తో అంద‌రినీ అల‌రిస్తోంది. 48వ పడిలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇవాళ టబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె లుక్‌ను విడుదల చేశారు. దానికి ‘‘ఒక్క లుక్‌తో ఆమె మన హృదయాలను కొల్లగొడుతుంది. తన టాలెంట్‌తో అందరినీ కట్టిపడేస్తుంది. టబు‌కు హ్యాపీ బర్త్‌డే. మీతో మరిన్ని సినిమాలు తీయాలని ఎదురుచూస్తున్నాం’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ మూవీ ద్వారా దాదాపు 11 ఏళ్ల తరువాత టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది టబు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సుశాంత్, జయరామ్, నివేథా పేతురాజ్, సునీల్, నవదీప్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. హారికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్ప టికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here