అలియాభ‌ట్ కి నచ్చిన టాలీవుడ్ హీరో అతడే..!

0

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఆసక్తిక‌ర కామెంట్ చేసింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్యూలో ఈ ముద్దుగుమ్మ చెప్పిన స‌మాధానం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టాలీవుడ్ లో త‌న‌కు న‌చ్చిన హీరో అంటూ ఆమె చెప్పిన పేరు ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టిస్తోంది. రాజ‌మౌళి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ లో ఈ భామ‌ ఓ హీరోయిన్ గా చేస్తోంది.

మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా, మీడియాతో మాట్లాడుతున్న వేళ, మీకు ఏ హీరో స్టయిల్ నచ్చుతుందన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని బ్రహ్మాస్త్ర సినిమాలో బిజీగా ఉన్న ఆలియా, హీరోయిన్స్ లో తనకు అనుష్క శర్మ స్టయిల్ ఇష్టమని, హీరోలలో విజయ్ దేవరకొండ స్టయిల్ ఎంతో సూపరని చెప్పింది.

రామ్ చ‌ర‌ణ్ తో న‌టిస్తూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పొగ‌డ‌డం కొంద‌రికి గిట్ట‌డం లేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో టాక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here