అడల్ట్ సినిమాలో న‌టిస్తేనే…!

0

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. షెర్లీన్ చోప్రా వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌పై ఆమె గురిపెట్టిన అడ‌ల్ట్ వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

2016లో సినిమాలో ఒక అవకాశం ఇవ్వాలని దర్శకుడు రాం గోపాల్ వర్మకు తన ఫొటోను పంపించానని. ఆ తర్వాత వర్మ తనకు ఒక స్క్రిప్ట్ పంపించారని… అందులో మొత్తం బెడ్ సీన్లే ఉన్నాయని షెర్లిన్ చోప్రా వెల్ల‌డించింది. వాటిపై వ‌ర్మ‌ను ప్ర‌శ్నించిన‌ట్టు తెలిపింది. దానికి అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాల గురించి అడ‌గ్గానే సన్నీ లియోన్ ని వ‌ర్మ ఉద‌హ‌రించిన‌ట్టుగా చెబుతోంది. అడల్ట్ సినిమాల్లో నటిస్తే సన్నీ లియోన్ మాదిరి గొప్ప స్టార్ అవుతావని వ‌ర్మ చెప్పాడని మండిపడింది.

ఆ సందర్భంగా వర్మకు తాను ఘాటుగా సమాధానమిచ్చానని… బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారానే సన్నీలియోన్ స్టార్ అయిందని… అడల్ట్ సినిమాల్లో నటించడం ద్వారా కాదని చెప్పానని షెర్లిన్ తెలిపింది. సినీరంగంలోని కొందరు నిర్మాతలు కూడా తనపై చెడు వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ప్రస్తుతం తనకు ఎవరి సహాయ, సహకారాలు అవసరం లేదని… తనకే ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ ఉందని తెలిపింది. పబ్లిసిటీ కోసం తాను ప్రస్తుతం ఈ విషయాలను వెల్లడించడం లేదని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here