Main Menu

ఎన్నిక‌లొస్తే గెలుపు మాదే..!

8648_Vijay_Sai_Reddy
Spread the love

ఏపీలో వైఎస్సార్సీపీ విజ‌యం ఖాయ‌మ‌ని ఆపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అందుకే చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే ఓడిపోతామని చంద్రబాబుకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ఎవరు పోరాడినా వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు.

జ‌గ‌న్ సార‌ధ్యంలో త‌మ పార్టీ ప్రత్యేకహోదా కోసం తమ పోరు కొనసాగిస్తుంద‌ని తెలిపారు. అసెంబ్లీ వేదికగా స్పీకర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. భావితరాలు ఆందోళన చెందాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.






Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *