సిబ్బందికి ‘టాటా’

tata-group-to-double-female-staff-develop-1000-women-leaders-revamp-the-way-it-grooms-future-cxos
Spread the love

దేశ టెలికం రంగంలో ఉద్యోగ భద్రత గాలిలో దీపముల మారింది. ఇప్పటికే పలు టెలికం కంపె నీలు విలీనాలు, నిర్వహణ భారం నెపంతో వేల మందిని తొలగించాయి. తాజాగా టాటా టెలీసర్విసెస్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. టాటా సన్స్‌ గ్రూపునకు చెందిన టాటా టెలి సర్వీసెస ్‌(టిసిఎస్‌ఎల్‌)లో పని చేసే 5వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరి తొలగింపునకు మూడు నుంచి ఆర్నెల్ల నోటీసు గడువు ఇవ్వనున్నారని సమాచారం. కాగా అంతకంటే ముందే సంస్థను వీడాలనుకున్న వారికి ప్యాకేజీలు ఇవ్వడంతో పాటు, సీనియర్లకు స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్‌) అవకాశాన్ని కల్పించనున్నారు. టిస ిఎస్‌ఎల్‌ భారీ మొత్తంలో అప్పుల ఊబిలో చిక్కుకోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ వర్గాల సమాచారం ప్రకారం.. 2018 మార్చి 31 నాటికి సర్కిల్‌ హెడ్‌లు తప్పుకోవాలని ఆ కంపెనీ సూచించింది. దీంతో టాటా గ్రూప్‌ తన 21 ఏళ్ల ఫోన్‌ సర్వీసు వెంచర్‌ టాటా టెలిసర్వీసస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతుంది. 2017 మార్చి 31 నాటికి ఈ కంపె నీలో 5,101 మంది పని చేస్తున్నారు. కాగా చాలా కొద్ది మొత్తంలో ఉద్యోగులను ఇతర గ్రూప్‌లలోకి బదిలీ చేయనున్నట్లు సమాచారం.

సీనియర్‌ ఉద్యోగులకు వచ్చే నెలల్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ను ఆఫర్‌ చేస్తున్నామని టాటా గ్రూప్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. అయితే కేవలం కొద్ది మంది మాత్రమే టాటా గ్రూపులోని ఇతర కంపెనీల్లోకి వెళ్లనున్నారు. టెలికాం యూనిట్‌లో ఉన్న ఉద్యోగుల నైపుణ్యాల ఆధారంగా గ్రూప్‌లోని ఇతర సంస్థలోకి బదిలీ చేసే అవకాశం ఉంది. ఇక ఒక నిర్దేశిత వయస్సు దాటిన సీనియర్లకు విఆర్‌ఎస్‌ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడే వైదిలిగితే కొంత కాలానికి గాను ముందస్తు వేతనమూ చెల్లించనున్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. టాటా కంపెనీ సంస్థలోని ఉద్యోగుల విషయంలో చాలా జాగ్రత్తగా, పద్దతి గా వ్యవహరిస్తుందని, అయితే ఇతర టాటా గ్రూప్‌లోని ఉద్యోగులతో పోలిస్తే టిటిఎస్‌ఎల్‌ ఉద్యోగుల పట్ల ఇది అనుచిత చర్యగా ఉందని పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఓ అధికారి పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపునపై ఓ ఆంగ్ల పత్రిక టిటిఎస్‌ఎల్‌ అధికారులను సంప్రదించగా సమాధానం రాలేదు.
వాటిల్లిందని అంచనా.






Related News

porn watching

బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత

Spread the loveతనను తాను దైవంగా ప్రకటించుకున్న ఓ బాబా జననాంగాన్ని కోసేసుకున్నారు. రాజస్థాన్‌లోని తారానగర్‌లో మంగళవారం ఈ ఘటనRead More

manojnad_2584

భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు

Spread the loveతెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు చాలా ఇబ్బంది ప‌డ్డారు. సామాన్యులకే కాక సెల‌బ్రిటీల‌కు కూడాRead More

  • సిబ్బందికి ‘టాటా’
  • నాలో లోపాలు నాకు తెలుసాయ్..
  • ఆ క్లబ్ లో అర్జున్ రెడ్డి
  • ఎఫ్ బీ, గూగుల్ కి హైకోర్ట్ నోటీసులు
  • ప‌వ‌న్ ఫ్లెక్సీ చుట్టూ వివాదం..!
  • బాబు పాల‌న మీద ఈ రివ్యూ చదివారా..?
  • హెరిటేజ్ పాలు తాగి ఆస్ప‌త్రి పాలు..!
  • వైసీపీ సార‌ధిగా ష‌ర్మిల‌
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *