రెండో పెళ్లి చేసుకోవచ్చు..!

రెండో పెళ్లి విషయంలో సుప్రీంకోర్ట్ ఆసక్తికర తీర్పు వెలువరించింది. రెండో పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరాలను తోసిపుచ్చింది. అందుకు భార్యభర్తల అంగీకారం అవసరం అని స్పష్టం చేసింది. విడాకుల వ్యవహారం పెండింగ్ లో ఉన్నప్పటికీ మరో పెళ్లికి అడ్డంకులు లేవని తేల్చేసింది. దాంతో ఈ తీర్పు పట్ల భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు కాదన్న వాదనను కోర్ట్ తోసిపుచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు(భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది.
విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్‌దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమ విడాకులకు అనుమతివ్వాలని కోర్టు కు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘హిందూ వివాహ చట్టం సామాజిక సంక్షేమానికి ఉద్దేశించిన, ఉదారవాద చట్టం. ఈ చట్టం అసలు లక్ష్యం చాటేలా భాష్యం చెప్పాల్సి ఉంది’ అని బెంచ్ పేర్కొంది.
చట్టంలో ఏముందంటే..
∙సెక్షన్ 5(1): జీవిత భాగస్వామి బతికి ఉండగా మరో వివాహం చేసుకోరాదు
∙సెక్షన్ 11: అలాంటి వివాహాలు చెల్లుబాటు కావు
∙సెక్షన్ 15: విడాకులు పొందిన వారు మళ్లీ ఎప్పుడు వివాహం చేసుకోవాలో చెబుతుంది
Related News

నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్
Spread the loveనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధమవుతోంది. త్వరలోనే బాలయ్య వారసుడిని హీరో చేసేందుకుRead More

రెండో పెళ్లి చేసుకోవచ్చు..!
Spread the loveరెండో పెళ్లి విషయంలో సుప్రీంకోర్ట్ ఆసక్తికర తీర్పు వెలువరించింది. రెండో పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరాలను తోసిపుచ్చింది. అందుకుRead More