Main Menu

వైసీపీ సార‌ధిగా ష‌ర్మిల‌

sharmila
Spread the love

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ పగ్గాలు ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకూ బలపడుతోంది. తెలంగాణలో వైసీపీ బతికి బట్ట కట్టాలంటే షర్మిలనే సరైన నాయకురాలని, ఆమె సారథ్యంలోనే పని చేస్తామని అనేక మంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంపాపేటలో తెలంగాణ శాఖ ప్లీనరీ జరిగింది. జిల్లాల నుంచి భారీ సం ఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినా, వారిలో ఉత్సాహం కనిపించ లేదు. అందుకు కారణం వైఎస్ కుటుంబీకులు ఎవరూ వేదికపై లేకపోవడం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్లీనరీ తొలి సారి నిర్వహించిన ప్లీనరీ కాబట్టి వైఎస్ జగన్ హాజరై ఉంటే ఆ ఉత్సాహం వేరేలా ఉండేదని నాయకులు అంటున్నారు. జగన్ గురువారం విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై నిరసనగా చేపట్టిన మహా ధర్నాలో పాల్గొనడం వల్ల ప్లీనరీకి హాజరుకాలేదు. జగన్ రాకపోయినా షర్మిల లేదా వారి తల్లి వైఎస్ విజయమ్మ వచ్చినా ఉత్సాహం కనిపించేది. నాయకులు తమ ప్రసంగాల్లో తెలంగాణలో షర్మిల నాయకత్వం వహించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి బాగా పని చేస్తున్నప్పటికీ, షర్మిల గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని, తెలంగాణలో పర్యటిస్తే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు సూచించారు.

పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రసంగిస్తూ అధికారంలోకి రావడం కనుచూపుమేరలో లేదని అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి సారించి, 2024లో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.






Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *