టాలీవుడ్ హీరో అరెస్ట్

samrat-reddy
Spread the love

టాలీవుడ్ లో మరో యువ హీరో చిక్కుల్లో పడ్డారు. అనుష్క సరసన హీరోగాపంచాక్షరి సినిమా హీరో, నటుడు జీవీఎస్ కృష్ణారెడ్డి అలియాస్ సామ్రాట్‌రెడ్డిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య కొండకల్లా హర్షితరెడ్డి ఫిర్యాదుతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తాను లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి తన భర్త విలువైన సామాన్లు తీసుకుపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్రాట్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంతేగాకుండా సామ్రాట్ రెడ్డి గే అంటూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనను వేధించినందుకు తగిన రీతిలో గుణపాఠం తప్పదని కూడా హర్షిత చెబుతోంది.

2015 నవంబర్ 29న సామ్రాట్‌రెడ్డికి, హర్షిత రెడ్డికి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొంతకాలం సంసారం సాఫీగా సాగినప్పటికీ తరువాత సామ్రాట్ తరచు అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో ఇరువురి మధ్య గొడవలు మొదలైనాయి. కొన్నిరోజులు తరువాత సామ్రాట్ రెడ్డి సోదరి అయిన సాహిత్య రెడ్డికి మాదాపూర్‌లోని నెక్టార్ గార్డెన్‌లోని లిలీ బ్లాక్‌లో ఫ్లాట్ వుంది. సాహిత్య రెడ్డికి చెందిన ఫ్లాట్ కావాలని చెప్పడంతో 2017 అక్టోబర్ నుండి నివాసము ఉంటున్నారు. తరుచు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో గత ఎడాది నవంబర్ 30న రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌లో హర్షిత రెడ్డి తనని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. హర్షిత ఒంటరిగా నెక్టార్ గార్డెన్‌లోని ఫ్లాటులో నివాముంటున్నారు. సంక్రాంతి పండుగకని 13వ తేదీన ఇంటికి తాళం వేసి తల్లిదండ్రులు నివాసముంటున్న అత్తాపూర్‌కు వెళ్లింది. 25వ తేదీన వచ్చిన హర్షిత రెడ్డి ఇంటికి వచ్చి చూసేసరికి బయట ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి తాళాలు పగలగొట్టి సమానులన్నీ తీసుకుపోయినట్లు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్రాట్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా సీసీటీవీలను, డ్రైవ్‌లను తీసుకుని వెళ్లినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీలను, డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్న మాదాపూర్ పోలీసులు సామ్రాట్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.






Related News

samrat-reddy

టాలీవుడ్ హీరో అరెస్ట్

Spread the loveటాలీవుడ్ లో మరో యువ హీరో చిక్కుల్లో పడ్డారు. అనుష్క సరసన హీరోగాపంచాక్షరి సినిమా హీరో, నటుడుRead More

poonam

ఆమె కోరడంతో నోరు విప్పబోతున్న పవన్

Spread the loveజనసేనాని స్పందిస్తున్నారు. కత్తి మహేష్ డిమాండ్ చేసినట్టుగా ఆయన నోరు విప్పే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు సమయంRead More

  • ధోనీకి షాకిచ్చిన కశ్మీరీలు
  • విదేశీ మహిళలతో వెబ్ సైట్లు
  • నందుల కొలమానం ఏమిటి?
  • కాజల్ అప్పుడలా…ఇప్పుడిలా..!
  • బాబు చెప్పింది చేయమంటే పోలీసులతో తన్నించారు..
  • సినీనటితో స్వామీజీ రాసలీలలు
  • బాబా ఆక్రుత్యం..జననాంగం కోసివేత
  • భారీ వర్షాలకు దెబ్బతిన్న హీరో కారు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *