Main Menu

బాబు పాల‌న మీద ఈ రివ్యూ చదివారా..?

20031984_1913238195618605_8204805653928338754_n
Spread the love

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. చంద్ర‌బాబు అండ్ కో వ్య‌వ‌హారాల మీద స‌ర‌దాగా రాసిన ఈ సెటైర్ వైర‌ల్ అవుతోంది.
త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న అల్లు అర్జున్ మువీ నా పేరు శివ టైటిల్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఇమేజ్ సాయంతో పోస్ట్ పెద్ద స్థాయిలో ప్ర‌చారం సాగుతోంది.ఇంత‌కీ అందులో ఏముంద‌నుకుంటున్నారా..అయితే మీరు కూడా చ‌దివేయండి

ప్రేక్షకులను మరచి, బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడిన ‘నా పేరు బాబు’ – చిత్ర సమీక్ష
చిత్రం పేరు:– నా పేరు బాబు మాటలే నా జాబు
నటీనటులు:– తారా బాబు.. తారా అలకేష్.. బజ్జి ఉమా.. కారులేని శ్రీనివాస్.. మంటా శ్రీనివాస్.. మాటలురాని ప్రభాకర్.. ఫిజిక్స్ ఖాన్.. యక్కాల రాముడు.. సదువు పారాయణ.. తుటాల సజాత.. తదితరులు
అథితి పాత్ర:– రేవంతు బుడ్డి
సంగీతం: — రాజధాని
ఛాయాగ్రహణం:– బాబునాడు, బాబుజ్యోతి
కళ:– విదేశం
నిర్మాత:– బాబు కార్పోరేట్స్ & కో
కథ.. దర్శకత్వం:– బాబు
నిర్మాణ సంస్థ:– తారా క్రియేషన్స్‌
విడుదల సం :– 2014

కథేంటంటే :– కరువుతో రైతులు, నిరుద్యోగంతో యువత, మందుషాపులతో మహిళలు ఇలా అనేకమంది కష్టాలు పడుతున్నా తారా వారికీ లాభాల పంట పండుతుంది. తమలాగే అందరూ ఉన్నారని ఊరూరు చాటింపు వేస్తూ తిరుగుతుంటాడు మన హీరో. అది ఎలా చేశాడు అనేది ఈ కథ. కళ్ళు తెరచి చూస్తే మీకే అర్ధం అవుతుంది.

ఎలా ఉందంటే :– మాటలు తప్పా చేతలు లేని చిత్రం.

ఎవరెలా చేశారంటే: బాబు మాటలతో కొండలు ఎక్కించి, చేతలతో కనీసం కొబ్బరి చెట్టు కూడా ఎక్కించలేకపోయాడు, అలకేష్ చేష్టలు-మాటలు నవ్వులు పూయించాయి. రౌడీలుగా బజ్జి ఉమా,మాటలురాని ప్రభాకర్ బాగా చేశారు. అసెంబ్లీ సన్నివేశంలో వీరి అరుపులకు ప్రేక్షకులు బిత్తరపోయారు. కారులేని శ్రీనివాస్ తో మొదటి భాగంలో అరిపించి, రెండో భాగంలో ఆస్తులు అమ్ముకోవడంలో దర్శకుడి ప్రతిభను మెచ్చుకోవలసిందే. యక్కాల రాముడి ఏడో తరగతి యక్కాలు కొత్తగా అనిపించలేదు. సదువు పారాయణ ఏదో చేద్దామని ఏదో చేసినట్టుగా, ఫిజిక్స్ ఖాన్ చెప్పిన ‘బికాంప్లెక్స్ లో బి.కాం ఉందనే’ డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక మంటా శ్రీనివాస్ ల్యాండ్ మాఫియా డాన్ గా బాగా కుదిరాడు. తూటాల సజాత పర్వాలేదు అనిపించింది. ఏమిలేని ఉమా కన్నీరు కట్టలు తెంచే విధంగా నీరిచ్చే గోడలను చిత్రం చివరికి వరకు కట్టే పాత్రను(తరువాత కూడా పూర్తికాదని అర్ధం వచ్చేట్టుగా) పండించాడు. అథితి పాత్రలో రేవంతు బుడ్డి హైకోర్టు సీన్ చిత్రానికి హైలేట్ గా నిలుస్తుంది.

కొసమెరుపు :– నిప్పు ముట్టుకుంటే కాలుతుందని అనే డైలాగ్ తో శుభం పడుతుంది.

గమనిక :– ఈ సమీక్ష బాధితుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇది బాధితుల దృష్టి కోణానికి సంబంధించింది.
(copied)


Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *