Main Menu

ఆమె కోరడంతో నోరు విప్పబోతున్న పవన్

poonam
Spread the love

జనసేనాని స్పందిస్తున్నారు. కత్తి మహేష్ డిమాండ్ చేసినట్టుగా ఆయన నోరు విప్పే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా పూనమ్ కౌర్ కూడా ట్వీట్ ద్వారా పవన్ స్పందించాలని డిమాండ్ చేయడంతో స్పందించక తప్పని స్థితి ఏర్పడింది. అయితే సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో , వాటిని పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పందించే అవకాశం ఉందని జనసేన వర్గం చెబుతోంది.

పవన్ ఫ్యాన్స్ తీరుపై స్పందించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కత్తి మహేష్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం తనకు పట్టనట్టే ఉన్నారు. దాంతో వివాదం చినికిచినికి గాలివానలా మారి చివరకు పూనమ్ కౌర్ ప్రస్తావన వరకూ వచ్చింది. ఆమె కూడా కావాలని ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. సంబంధం లేని విషయంలో ఆమె జోక్యం చేసుకుని కత్తి మహేష్ కి అవకాశం ఇచ్చారు. పవన్ తో ఆమె సంబంధాల గురించి ఆరు ప్రశ్నలు సంధించినా సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడ్డారు.

చివరకు ఆమె కత్తి మీద నుంచి పవన్ మీద ద్రుష్టి మరల్చారు. తన ఆత్మగౌరవం కాపాడాలని వేడుకున్నారు. రాజకీయాలలో తనను పావుగా వద్దని చెప్పారు. తాను నేరుగా పవన్ ని కలిసి సమస్యను వివరిస్తానని ఆమె ట్వీట్ చేశారు. దాంతో ఇప్పుడు ఓ పెళ్లి కాని యువతి వ్యవహారంలో పవన్ స్పందించక తప్పని స్థితి ఏర్పడింది. ఓ పార్టీ అధినేతగా ఉండి, ఓ యువతితో ఆయన సన్నాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన నేపథ్యంలో నోరు మెదపకపోతే సమస్య తీవ్రం అవుతందని భావిస్తున్న జనసేన దానికి తగ్గట్టుగా వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా 14వ తేదీన పూనమ్ కౌర్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు.






Related News

SBICBI

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the loveపదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటుRead More

somu, gorantla

సోము వీర్రాజు వసూళ్లు ఎక్కడో తెలుసా?

Spread the loveతెలుగుదేశం, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఓవైపు సోము వీర్రాజు నేరుగా చంద్రబాబు మీద గురిపెట్టారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *