Main Menu

నందుల కొలమానం ఏమిటి?

Spread the love

వరుసగా మూడేళ్లకు సంబంధించిన నంది అవార్డులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లకు సంబంధించిన విజేతలను అధికారికంగా ప్రకటించింది. త్వరలో నందుల పంపిణీ కూడా జరగబోతోంది. కానీ తాజాగా ప్రకటించిన నందీ అవార్డుల ఎంపికను గమనిస్తే ఫలువురికి ఆశ్చర్యం కలుగుతుంది. అవార్డులకు కొలబద్ద ఏమిటనే సందేహం కలుగుతుంది. అవార్డుల జ్యూరీ కమిటీ నిర్ణయాలకు కొలమానం మీద అనుమానం వస్తుంది.

తాజాగా 2014,15,16 సంవత్సరాలకు ప్రకటించిన నందీ అవార్డుల ఎంపికలో 2014లో లెజెండ్ మువీ అవార్డుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. కానీ ఆ సీనిమా సమాజానికి ఏం సందేశం ఇస్తుందనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. సినిమాలో బాలయ్య నటనకు అవార్డు ఎలా దక్కిందనే ప్రశ్న పక్కన పెడితే ఆ సినిమా ద్వారా సభ్య సమాజానికి కలిగే మేలు ఏమిటో జ్యూరీ కమిటీ సభ్యులు సూటిగా చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే ఒకనాడు 300 సినిమాలతో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడనిపించుకున్న ఎన్టీఆర్ కి ఒక్క నంది అవార్డ్ దక్కకపోయినా తాజాగా ఆయన తనయుడు బాలయ్యకు మాత్రం మూడు అవార్డులు వచ్చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందీ విజేతల సరసన నిలిచి ఉత్తమ నటుడు అనిపించుకున్నారు.

అందుకే అవార్డుల ఎంపికలో కూడా అనేక ప్రభావిత అంశాల నేపథ్యంలో ప్రాధాన్యతలు మారిపోయినట్టు స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాటలను కూడా ఓ మారు గుర్తు చేసుకోవాల్సి ఉంది. పదవి , పలుకుబడి పైరవీలు ఉంటే నందులు ఇంటికి నడిచి వస్తాయి అని చెప్పిన మాటలలొ అంతరార్ధం గ్రహించి నంది అవార్డుల ఎంపికను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.ఏమైనా పరిస్థితులు మారుతున్న కొద్దీ ప్రభావాలు, ప్రమాణాలు మారిపోతుంటాయి. కాబట్టి వర్తమాన సినీలోకంలో ఉత్తమమైనవి ఎంపికలో ఆనాటి ప్రమాణాలను బట్టి చూడలేం కాబట్టి ప్రస్తుతం విజేతలను అభినందించాల్సిందే. అదే సమయంలో అనేకమంది అర్హులకు కూడా వివిధ కారణాలతో పక్కన పెట్టే పరిస్థితి ఉండడం మాత్రం నిరాశజనకంగా భావించాల్సిందే. అలాంటి పరిస్థితి పోయి ప్రతిభ ఆధారంగా అవార్డులు కేటాయించే రోజులు రావాలని ఆశించాల్సిందే.


Related News

కోట్ల రాక‌కు కేఈ అడ్డంకి, చేరిక వాయిదా

Spread the loveమాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి సైకిలెక్క‌డం వాయిదా ప‌డింది. ఆయ‌న‌కు అనుకోని ఆటంకం ఏర్ప‌డింది.Read More

నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్

Spread the loveనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య వార‌సుడిని హీరో చేసేందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *