Main Menu

నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్

Spread the love

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య వార‌సుడిని హీరో చేసేందుకు త‌గిన క‌థ ఖ‌రారు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. నంద‌మూరి మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఆరంభంలో ఉంటుందదన్నది స్ప‌ష్ట‌మ‌య్యింది. త‌న‌యుడి కోసం ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌ ఎన్నో కథలను విన్నాడని వాటిలో త‌గిన క‌థ‌ను పైన‌ల్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందనుకున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఏడాది ముగుస్తున్నా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ప్రస్తుతానికి ఆలోచించడంలేదని తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం మరోవైపు జరుగుతున్నట్లుగా టాక్. మోక్షజ్ఞ కోసం వినాయక్, క్రిష్, బోయపాటి వంటి దర్శకుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో పూరి జగన్నాథ్ కూడా చేరినట్టు సమాచారం. ఈమధ్యకాలంలో పూరికి హిట్లు లేవు. అయతే అతని ఖాతాలో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు లేకపోలేదు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ను చిరుత చిత్రంతో పరిచయం చేశాడు. అందుకే మోక్షజ్ఞ బాధ్యతను పూరికి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎన్బీకే బృందం చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూరికే ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం.






Related News

కోట్ల రాక‌కు కేఈ అడ్డంకి, చేరిక వాయిదా

Spread the loveమాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి సైకిలెక్క‌డం వాయిదా ప‌డింది. ఆయ‌న‌కు అనుకోని ఆటంకం ఏర్ప‌డింది.Read More

నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్

Spread the loveనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య వార‌సుడిని హీరో చేసేందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *