Main Menu

సీఎం ఇచ్చిన చెక్ చెల్లలేదు..!

Spread the love

పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకున్న చెక్కు చెల్లుబాటు కాకపోవడంతో ఓ విద్యార్థి జరిమానా కట్టాల్సి వచ్చిన అనూహ్య ఉదంతమిది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాకు చెందిన అలోక్‌ మిశ్రా పదోతరగతి బోర్డు పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. దీంతో అతడిని అభినందిస్తూ.. గతనెల 29న లఖ్‌నవూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లక్ష రూపాయల చెక్కు బహూకరించారు. బారాబంకీ జిల్లా పాఠశాలల పర్యవేక్షకుడు(డీఐవోఎస్‌) రాజ్‌కుమార్‌ యాదవ్‌ సంతకంతో ఆ చెక్కు జారీ అయింది. సదరు సొమ్మును కుమారుడి ఖాతాలో జమ చేసేందుకు అలోక్‌ తల్లిదండ్రులు ఈ నెల 5న చెక్కును బ్యాంకులో వేశారు. రెండు రోజులైనా డబ్బు జమకాకపోవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరాతీశారు. సీఎం ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదని బ్యాంకు అధికారులు తెలిపారు. సంతకాలు సరిపోలకపోవడమే అందుకు కారణమని వెల్లడించారు. చెక్కు నిరాదరణకు గురికావడంతో అలోక్‌కు జరిమానా కూడా విధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఇతర విద్యార్థులకు ఇచ్చిన చెక్కులేవీ నిరాదరణకు గురికాలేదని.. అలోక్‌కు కొత్త చెక్కు జారీ చేశామని డీఐవోఎస్‌ రాజ్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.






Related News

కోట్ల రాక‌కు కేఈ అడ్డంకి, చేరిక వాయిదా

Spread the loveమాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి సైకిలెక్క‌డం వాయిదా ప‌డింది. ఆయ‌న‌కు అనుకోని ఆటంకం ఏర్ప‌డింది.Read More

నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్

Spread the loveనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే బాల‌య్య వార‌సుడిని హీరో చేసేందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *